మహేష్ బాబుకి ఇష్టమైన గుత్తి వంకాయ్ పలావ్.. ప్రతిరోజూ ఈ రెస్టారెంట్‌ నుంచే!

Share Icons:
సూపర్ స్టార్ వయసు చెప్తే నమ్మరు కాని… ఆయన మరో ఐదేళ్లలో హాఫ్ సెంచరీకి చేరువవుతున్నారు. 1975 ఆగష్టు 9న పుట్టిన మహేష్ బాబు 45 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. ఊరికోండి బాస్.. ఈమధ్య ఆయన కొడుకు గౌతమ్‌తో కలిసి దిగిన ఫొటోలు చూస్తే ఎవరైనా ఆయనకు 45 ఏళ్లు అంటే నమ్ముతారా?? గౌతమ్ అన్నయ్యో.. కుదిరితే తమ్ముడన్నా నమ్మేస్తారు అంత యంగ్‌గా ఉన్నారు మహేష్ బాబు. పైగా ఈ లాక్ డౌన్‌లో పూర్తి విరామం దొరకడంతో ఫిట్ నెస్‌పై ఫుల్ టైం కేటాయించారు మహేష్ బాబు. ఈ వీడియోలను మహేష్ బాబు సతీమణి నమ్రత షేర్ చూస్తుంటుంది కూడా.

అయితే మహేష్ బాబు ఇంత యంగ్‌గా కనిపించడానికి ఏం తింటారు అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. ఆయన ఫుడ్ విషయంలో చాలా కేర్ తీసుకుంటారని.. షూటింగ్ సమయంలో ప్రత్యేకించి ఇంటి నుంచి భోజనం వస్తుందని.. కుదరకపోతే ప్రత్యేకించి డైట్ కోసం ఆయన వెంట కుక్ ఉంటారని చాలా వార్తలు చూస్తూ ఉంటాము.

అయితే మహేష్ బాబు ఏమి తింటారో తెలియదు కాని.. ఓ రెస్టారెంట్ నుంచి మాత్రం ప్రతిరోజు ఆయనకు ఇష్టమైన గుత్తివంకాయ పలావ్ వెళ్తూ ఉంటుందట. ఆ హోటల్ పేరే ‘ఉలవచారు’. హా!! ఆ రెస్టారెంట్ పేరు ఉలవచారే.. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లో… అదే మన బాలయ్య బాబుగారి ఇంటి పక్కనే ఉంటుంది ఈ రెస్టారెంట్. ఈ హోటల్ నుంచి మహేష్ బాబుకి ప్రతి రోజు ‘గుత్తి వంకాయ పలావ్’ పంపిస్తూ ఉంటామని అంటున్నారు హోటల్ నిర్వాహకులు.

రాయలసీమ నుంచి వచ్చిన ఇద్దరు అన్నదమ్ములు (విజయ్ రెడ్డి, వినయ్ రెడ్డి) కలిసి పెట్టిన .. ప్రారంభించిన కొద్దిరోజుల్లేనే భోజన ప్రియులకు ఇష్టమైన రెస్టారెంట్‌గా మారింది. గత ఏడేళ్లుగా హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ (మెయిన్ బ్రాంచ్)‌లో నడిస్తున్న ఉలవచారు రెస్టారెంట్‌కి ఎక్కువగా ధనికులు, సెలబ్రిటీలు వస్తుంటారు. గతంలో అక్కినేని కోడలు సమంత ఈ హోటల్‌లో వంటకాలను రుచిచూసి వహ్ వా.. ఉలవచారు అని ట్వీట్ పెట్టింది.

అయితే తమ రెస్టారెంట్ ప్రమోషన్స్ కోసం పెద్దగా కష్టపడమని.. క్వాలిటీ ఫుడ్ అందించడమే తమ ప్రమోషన్ అంటున్నారు ఈ ఉలవచారు బ్రదర్స్. చాలా మంది సెలబ్రిటీలు వస్తుంటారని.. మహేష్ బాబుకి గుత్తివంకాయ పలావ్ అంటే చాలా ఇష్టం అని.. ఉలవచారు రెస్టారెంట్‌ నుంచి ప్రతి రోజు పంపిస్తాం అంటున్నారు. మహేష్ కొంచెం టేస్ట్ చేస్తారట.. అంతేకాదు మహేష్ బాబు ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా.. కేటరింగ్ మేమే చేస్తాం అంటున్నారు ‘ఉలవచారు’ రెస్టారెంట్ నిర్వాహకులు విజయ్ రెడ్డి, వినయ్ రెడ్డి. మహేష్ బాబుతో పాటు నమ్రత కూడా ‘ఉలవచారు’ ఫుడ్‌ని ఇష్టపడతారంటున్నారు వీరు.

నిజంగానే మహేష్‌కి గుత్తి వంకాయ్ పలావ్ ప్రతిరోజు పంపిస్తారా.. లేదంటే ఇది వాళ్ల మార్కెట్ స్ట్రాటజీనో తెలియదు కాని.. ఉలవచారు రెస్టారెంట్ ఓనర్స్ విజయ్ రెడ్డి, వినయ్ రెడ్డిలు మాత్రం మహేష్ బాబుకి ఇష్టమైన డిష్ ఇదే అంటున్నారు. మరి నిజంగానే ఉలవచారు ఫుడ్ అంత బాగుంటుందా?? మహేష్ బాబు ప్రతిరోజు టేస్ట్ చేసే ‘గుత్తి వంకాయ పలావ్’లో ఉన్న స్పెషాలిటీ ఏంటి?? తెలియాలంటే ఓసారి ఉలవచారుకి వెళ్లాల్సిందే.. అన్నట్టు చెప్పడం మర్చిపోయాం.. వెళ్లేటప్పుడు కాస్త డబ్బులు ఎక్కువే తీసుకుని వెళ్లండి.. టేస్ట్‌తో పాటు రేటు కూడా అదే రేంజ్‌లో ఉంటుంది మరి.