మహిళలపై గృహ హింస దాడులు.. అన్నీ మూసుకొని యుద్ధం చేయండంటూ యంగ్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

Share Icons:
మహమ్మారి కరోనా వైరస్ జనాలకు ఊహించని కష్టాలను తెచ్చిపెట్టింది. ఆర్ధిక స్థితిగతులు దెబ్బతీయడమే గాక కేసులను కూడా పెంచేసింది. కరోనా ఉదృతికి కళ్లెం వేయడంలో భాగంగా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ కారణంగా మహిళలపై గృహ హింస పెరిగిపోయిందని సర్వేలు సైతం వెల్లడించాయి. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ తాజాగా సంచలన కామెంట్స్ చేసింది హీరోయిన్ . మహిళామణులంతా దీనిపై సమిష్టిగా యుద్ధం చేయాల్సిన అవసరముందని పేర్కొంది.

శరత్ కుమార్ కూతురు హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ నిత్యం ఏదో ఒక రూపంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. డేరింగ్ డాషింగ్‌గా తన ఫీలింగ్స్ చెబుతూ ఓపెన్ అవుతుంటుంది. ఈ లాక్‌డౌన్ వేళ ఆపదలో ఉన్నవారికి చేతనైన సాయాన్ని అందిస్తూ మానవత్వాన్ని చాటుకున్న ఈమె.. తాజాగా మహిళలపై జరుగుతున్న గృహ హింస దాడులపై స్పందించింది. ఈ మేరకు ఓ ఫోటో పోస్ట్ చేస్తూ మహిళలంతా తన లాగే ఫోటో పోస్ట్ చేస్తూ నిరసన తెలపాలని కోరింది.

Also Read:
”ఈ లాక్‌డౌన్ పీరియడ్‌లో మహిళలపై గృహ హింస దాడులు పెరగడం అందరం చూసాం. ఇది రోజురోజుకు శృతిమించిపోతోంది. దీనిపై మౌనంగా ఉండటం సరికాదు. మనమంతా ముందుకు వచ్చి మద్దతు తెలపాలి. దీనిపై అందరికీ అవగాహన కల్పించాలి. బాధితురాళ్లను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది. అంతా కలిసి ఓ రిపోర్ట్ రెడీ చేయాలి. ఇలాంటి వాటిపై ఫిర్యాదు చేయాలంటే 181 లేదా జాతీయ మహిళా కమిషన్ నెంబర్ 7217735372కు వాట్సప్ చేయండి. అలాగే #ActAgainstAbuse ఉద్యమంలో పాల్గొని మద్దతు తెలిపేందుకు నోరు, కళ్లు, చెవులు మూసుకుని ఉన్న ఫోటోను ఈ హ్యాష్ ట్యాగ్‌తో పోస్ట్ చేయండి” అని పేర్కొంటూ ట్వీట్ చేసింది వరలక్ష్మి శరత్ కుమార్.

ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్.. రెండు తెలుగు సినిమాల్లో నటిస్తోంది. రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ‘క్రాక్’ చిత్రంలో, అలాగే అల్లరి నరేశ్ ‘నాంది’ సినిమాలో భాగం అవుతోంది. ఈ రెండు సినిమాల్లో ఆమె పోషిస్తున్న క్యారెక్టర్స్ దేనికవే ప్రత్యేకం అని తెలుస్తోంది.