మళ్లీ బుల్లితెర వైపు సురేఖా వాణి చూపు.. అందుకేనట!

Share Icons:
గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేదు. ఎన్నో సినిమాల్లో ఆమె నటించారు. సహాయ నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. తెలుగతో పాటు తమిళ చిత్రాల్లోనూ నటిస్తున్నారామె. అయితే, ప్రస్తుతం ఆమెకు అంత గొప్ప పాత్రలైతే రావడం లేదు. అన్నీ చిన్న చిన్న పాత్రలే. సురేఖా వాణి తెలుగులో చివరిగా నటించిన చిత్రం ‘తేజ్ ఐ లవ్‌యు’. ఇదొచ్చి రెండేళ్లు అవుతోంది. అయితే, సురేఖా వాణి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు ఫొటోలు పోస్ట్ చేస్తున్నారు.

Also Read:

తన కూతురు సుప్రీతతో టిక్ టాక్ వీడియోలు చేస్తూ నెటిజన్స్‌ని అలరిస్తున్నారు సురేఖ. ప్రస్తుతం ఈమె చేతిలో నాలుగు సినిమాలు ఉండగా, అందులో రెండు తమిళ సినిమాలు ఉన్నాయి. లాక్‌డౌన్ తర్వాత ఈ సినిమా షూటింగ్‌లతో బిజీగా కానున్నారు. అయితే, సినిమాల్లో పాత్రలు అంతంతమాత్రంగా ఉండటంతో సురేఖ టీవీ వైపు చూస్తున్నారట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు తాను సిద్ధమవుతున్నట్టు చెప్పారు.

Also Read:

నిజానికి సురేఖా వాణి కెరీర్ ప్రారంభమైందే బుల్లితెరపై. యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన సురేఖకు డైరెక్టర్ సురేష్ తేజ ‘మొగుడ్స్ పెళ్లామ్స్’, ‘హార్ట్ బీట్’ వంటి షోలలో అవకాశం ఇచ్చారు. వీటితో ఆమె పాపులర్ అయ్యారు. ఆ తరవాత సురేష్ తేజనే సురేఖావాణి పెళ్లాడారు. అయితే, కిందటేడాది మే 6న సురేష్ తేజ కన్నుమూశారు. మరోవైపు, సురేఖా వాణి తన కుమార్తె సుప్రీతను హీరోయిన్‌గా పరిచయం చేయాలని చూస్తున్నారని వదంతులు వినిపిస్తున్నాయి.