మర్డర్ మిస్టరీ.. ఆసక్తి రేకెత్తిస్తున్న నవదీప్ RUN ట్రైలర్

Share Icons:
ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ‘ఆహా’ సమర్పణలో రూపుదిద్దుకుంటున్న తాజా సినిమా (రన్) RUN. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంగా మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందించిన ఈ సినిమాకు లక్ష్మీకాంత్ చెన్న దర్శకత్వం వహిస్తుండగా.. యంగ్ హీరో ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

ఒక నిమిషం 32 సెకనుల నిడివితో కట్ చేయబడిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. కొత్త పెళ్ళైన జంట ఇంట్లో అడుగుపెట్టాక మర్డర్ జరగడం, ఆ మర్డర్ మిస్టరీ చేధించే దిశగా పోలీసుల ప్రయత్నాలు, హీరో నవదీప్ చిక్కుల్లో పడే సన్నివేశాలు చూపిస్తూ సినిమాపై ఆసక్తి పెంచేశారు. ఖచ్చితంగా ఈ మూవీ మునుపెన్నడూ చుడనివిధంగా థ్రిల్ చేస్తుందనే ఫీలింగ్ కలిగించారు.

ఈ చిత్రంలో పూజిత పొన్నాడ, వెంకట్, అమిత్ తివారి, ముక్తార్ ఖాన్, కౌసల్య, మనాలి రాథోడ్, షఫీ, మధు నందన్, భాను శ్రీ, కిరీటి దామరాజు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మే 29వ తేదీన ఓటీటీ వేదికపై ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.