మరోసారి భయపెట్టనున్న చంద్రముఖి.. అప్పుడు మిస్ అయింది కానీ.. సీనియర్ హీరోయిన్ రెడీ!

Share Icons:
చంద్రముఖి.. సౌత్ ఇండియాలో ఈ సినిమా చూడని వ్యక్తి లేడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా పీ. వాసు దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా దక్షిణాది ప్రేక్షకులను థ్రిల్ చేసింది. హారర్ ఓరియెంటెడ్ సినిమాల్లో కొత్తదనం చూపించడంతో అందరూ అట్రాక్ట్ అయ్యారు. 2005 సంవత్సరంలో విడుదలైన ఈ మూవీ సూపర్ సక్సెస్ సాధించింది. తెలుగు, తమిళ భాషల్లో భారీ ఆదరణ చూరగొంది.

ఆ సమయంలో వరుస డిజాస్టర్స్‌తో ఇబ్బంది పడుతున్న రజినీకాంత్.. ఈ సినిమాతోనే తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కారు. ఇక ఈ చిత్రంలో చంద్రముఖిగా గ్లామర్ బ్యూటీ జ్యోతిక చూపిన అభినయం ప్రేక్షకలోకాన్ని విశేషంగా ఆకట్టుకుంది. అప్పటివరకు కేవలం గ్లామర్ పాత్రలు మాత్రమే చేసిన జ్యోతిక ఈ సినిమాలో అద్భుత నటన ప్రదర్శించి భేష్ అనిపించుకుంది. కాగా మళ్ళీ ఇన్నాళ్లకు ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ పీ. వాసు.

Also Read:
మరికొద్ది రోజుల్లోనే పి.వాసు దర్శకత్వంలో `చంద్రముఖి` సీక్వెల్ సెట్స్ మీదకు రానుంది. అయితే ఇందులో చంద్రముఖిగా బయపెట్టేది జ్యోతిక కాదు సీనియర్ హీరోయిన్ అనే వార్త సరికొత్త ఆసక్తి క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాలో రాఘవ లారెన్స్, సిమ్రాన్ భాగం కాబోతున్నారని, చంద్రముఖిని మించి ఉండేలా ఈ సీక్వల్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. నిజానికి చంద్రముఖి మొదటి భాగంలోనూ సిమ్రాన్‌కే అవకాశం దక్కిందట. కానీ అప్పుడు ఛాన్స్ వదులుకున్న ఆమె.. ఈ సారి ఇంట్రెస్ట్‌గా ఉందని సమాచారం.