మనమంతా ఏక‌మని చాటుదాం: కోహ్లీ, రోహిత్‌

Share Icons:
ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ విస్త‌రిస్తున్నవేళ‌.. మ‌న ఐక్య‌త చూపాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని భార‌త క్రికెట‌ర్లు , రోహిత్ శ‌ర్మ అభిప్రాయ‌ప‌డ్డారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ పిలుపు మేర‌కు ఆదివారం రాత్రి 9 గంట‌ల‌కు లైట్ల‌ను ఆర్పివేసి,అందుబాటులో ఉన్న వ‌స్తువుల‌తో వెలుగులు నింపుదామ‌ని సూచించారు. భార‌త్‌లో క‌రోనా వైర‌స్ విస్త‌రిస్తున్న వేళ ఈనెల 14 వ‌ర‌కు మోడీ దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అలాగే ఆదివారం రాత్రి 9 గంట‌ల‌కు 9 నిమిషాల‌పాటు కొవ్వ‌త్తులు, టార్చిలైట్లు, సెల్‌ఫోన్ లైట్ల‌తో వెలుగు పంచుదామ‌ని మోడీ కోరారు

Read Also:

తాజాగా మోడీకి మ‌ద్ద‌తుగా కోహ్లీ, రోహిత్ ట్వీట్లు చేశారు. స్టేడియంలోని ఫ్యాన్స్ ద్వారా త‌మ‌కు మ‌ద్ద‌తు ల‌భిస్తుంద‌ని, అలాగే ప్ర‌జ‌లు కూడా ఆదివారం ముందుకొచ్చి, స్ఫూర్తి చాటాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని కోహ్లీ వ్యాఖ్యానించాడు. ప్ర‌పంచానికి మ‌న‌మంతా ఒక్క‌టేన‌ని చాటాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని తెలిపాడు. మ‌న ఆరోగ్య యోధుల‌కు అండ‌గా ఉన్నామ‌ని తెలుపుదామ‌ని పేర్కొన్నాడు.

Read Also:

మ‌రోవైపు క‌రోనాపై పోరాటాన్ని మ్యాచ్‌లో విజ‌యం సాధించ‌డంతో పోల్చిన రోహిత్‌.. ఈ పోరాటంలో అంద‌రూ క‌లిసి రావాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని సూచించాడు. ద గ్రేట్ టీమిండియా హ‌డిల్‌కు సంఘీభావం తెల‌పాల‌ని రోహిత్ తెలిపాడు. మ‌రోవైపు క‌రోనా వైర‌స్ దేశవ్యాప్తంగా రోజురోజుకు విస్త‌రిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా 3వేల‌కుపైగా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. 99 మంది మ‌ర‌ణించారు.