భారత పర్యటనపై కోటి ఆశలతో క్రికెట్ ఆస్ట్రేలియా!

Share Icons:
ఈ ఏడాది త‌మ దేశంలో భార‌త జ‌ట్టు ప‌ర్య‌ట‌న జ‌రిగే అవ‌కాశాలు 90 శాతానికిపైగా ఉన్నాయ‌ని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ కెవిన్ రాబ‌ర్ట్స్ అన్నారు. ఈ ప్ర‌పంచంలో ఏది వంద‌శాతం జ‌రుగుతుంద‌ని చెప్ప‌లేమ‌ని, అందుకే 90 శాతం అన్నాన‌ని ఈ సంద‌ర్భంగా టూర్‌పై విశ్వాసం వ్య‌క్తం చేశారు. ఈ ఏడాది న‌వంబ‌ర్ నుంచి భారత్.. ఆస్ట్రేలియాలో ప‌ర్య‌టించాల్సి ఉంది. అయితే క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా అన్ని క్రికెట్ సిరీస్‌ల‌పై ప్ర‌భావం ప‌డింది. ఈ నేప‌థ్యంలో భార‌త్‌-ఆసీస్ సిరీస్‌పై అనుమానాలు వ్య‌క్త‌మయ్యాయి.

Must Read:
అయితే ఈ ప‌ర్య‌ట‌న క‌చ్చితంగా జ‌రిగి తీరుతుంద‌ని, దీనిపై ఎలాంటి అనుమానాలు లేవని రాబ‌ర్ట్స్ ధీమా వ్య‌క్తం చేశారు. ఈ సిరీస్‌కు అభిమానులు కూడా పెద్ద‌యెత్తున హాజ‌ర‌య్యే అవ‌కాశ‌ముంద‌ని విశ్వాసం వ్య‌క్తం చేశారు. మ‌రోవైపు విదేశాల్లో త‌మ టీమ్ ప‌ర్య‌టించి, అక్క‌డి ప‌రిస్థితులు ఒకే చేశాకే, త‌మ క్రికెట్ జ‌ట్టు ఆయా దేశాల్లో ప‌ర్య‌టిస్తుంద‌ని తెలిపారు.

Must Read:
రాబోయే రోజుల్లో ఇంగ్లాండ్‌లో ఆస్ట్రేలియా ప‌ర్య‌టించ‌నుంది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు వెస్టిండీస్‌, పాకిస్థాన్ జ‌ట్లు ఇంగ్లాండ్‌లో సిరీస్ ఆడ‌నున్నాయి. ఈ సిరీస్‌ల‌ను నిశితంగా గ‌మ‌నిస్తామ‌ని, అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితే త‌మ టీమ్ ఇంగ్లాండ్‌లో ప‌ర్య‌టిస్తుంద‌ని సీఏ పేర్కొంది. మ‌రోవైపు క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఈ ఏడాది అక్టోబ‌ర్‌లో జ‌ర‌గాల్సిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్ వాయిదా ప‌డే అవ‌కాశాలున్నాయి.