బౌలర్‌కి హెల్ప్ చేసేందుకు ధోనీ నిరాకరణ.. కారణం చెప్పిన భజ్జీ

Share Icons:
ఐపీఎల్ 2018 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ శార్ధూల్ ఠాకూర్‌కి సాయం చేసేందుకు మహేంద్రసింగ్ ధోనీ నిరాకరించాడని వెటరన్ ఆఫ్ స్పిన్నర్ వెల్లడించాడు. పదేళ్ల పాటు ముంబయి ఇండియన్స్ టీమ్‌కి ఆడిన హర్భజన్.. 2018 ఐపీఎల్ సీజన్‌ నుంచి చెన్నై టీమ్‌కి ఆడుతున్నాడు. ఆ సీజన్‌లో లయ తప్పిన శార్ధూల్ ఠాకూర్‌‌కి హెల్ప్ చేయమని తాను అడగగా.. ధోనీ నిరాకరించినట్లు భజ్జీ చెప్పుకొచ్చాడు.

Read More:

వాస్తవానికి మహేంద్రసింగ్ ధోనీ నైజం అది కాదు. వికెట్ల వెనుక నుంచి క్రీజులోని బ్యాట్స్‌మెన్ ఫుట్‌వర్క్‌ని నిశితంగా పరిశీలించే ధోనీ బౌలర్లకి చక్కటి సలహాలు, సూచనలు ఇస్తుంటాడు. అలా ధోనీ సాయం తీసుకుని సక్సెస్ అయిన బౌలర్లు ఎంతో మంది ఉన్నారు. కానీ.. శార్ధూల్ ఠాకూర్ విషయంలో మాత్రం ధోనీ ఆ మ్యాచ్‌లో కఠినంగా వ్యవహరించడానికి గల కారణాన్ని హర్భజన్ సింగ్ వివరించాడు. ఐపీఎల్ 2018 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.

Read More:

‘‘పుణె వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో శార్ధూల్ ఠాకూర్ పేలవ బౌలింగ్‌తో వరుసగా పరుగులిస్తూ కనిపించాడు. దాంతో.. ఓ ఓవర్‌లో ఫస్ట్ రెండు బంతులకీ అతను 4, 6 ఇవ్వడంతో నేనే స్వయంగా ధోనీ వద్దకి వెళ్లి.. ఎందుకు నువ్వు శార్ధూల్‌కి ఏమీ చెప్పడం లేదు. యాంగిల్ మార్చమని సూచించడం లేదా ఫీల్డర్స్‌ని బౌండరీ లైన్ వద్ద ఉంచడం ద్వారా అతని హెల్ప్ చేయచ్చు కదా..? అని అడిగాను. దాంతో.. అతను భజ్జీ పా.. ఇప్పుడు నేను ఏదైనా చెప్పాననుకో అతను మరింత కన్‌ప్యూజ్ అవుతాడు. అతని వద్ద ఎలాంటి బౌలింగ్ వ్యూహాలు లేవు నాకు అనిపించినప్పడు నేను ప్లాన్స్ చెప్తాను అని అన్నాడు. అవును నిజమే.. ధోనీ అలా చెయ్.. ఇలా చెయ్ అని చెప్పి విసిగించే కెప్టెన్ కాదు. బౌలర్‌కి పూర్తి స్వేచ్ఛనిస్తాడు. ఒకవేళ బౌలర్‌ వద్ద ఎలాంటి ఆప్షన్స్ లేవని అతనికి తెలిస్తే తప్పకుండా సాయం చేస్తాడు’’ అని హర్భజన్ సింగ్ వెల్లడించాడు.