బుల్లి హార్దిక్ పాండ్యా ఫొటో చూశారా..? ఫస్ట్ పిక్.. ట్విట్టర్‌లో జోక్‌ల వర్షం

Share Icons:
టీమిండియా ఆల్‌రౌండర్ తన కొడుకు ఫొటోని అభిమానులతో పంచుకున్నాడు. గురువారం తన భార్య నటాషా స్టాంకోవిచ్‌‌ పండంటి మగబిడ్డకి జన్మనిచ్చినట్లు ప్రకటించిన హార్దిక్.. తాజాగా ఆసుపత్రిలో ఆ బిడ్డని తన చేతుల్లోకి తీసుకుని మురిసిపోతున్న ఫొటోని ట్విట్టర్‌లో షేర్ చేశాడు. దాంతో.. కొంత మంది అభిమానులు అతనికి అభినందనలు తెలుపుతుండగా.. మరికొందరు సెటైర్లు పేలుస్తున్నారు. దానికి కారణం ఏడు నెలల్లోనే హార్దిక్, నటాషాల నిశ్చితార్థం, పెళ్లి, బిడ్డ పుట్టడం జరిగిపోవడమే.

ఈ ఏడాది జనవరి 1న నటాషాని తాను నిశ్చితార్థం చేసుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించి కుటుంబ సభ్యులతో పాటు అభిమానుల్ని ఆశ్చర్యపరిచిన హార్దిక్ పాండ్యా.. మధ్యలో ఎలాంటి పెళ్లి కబురు వినిపించకుండానే మే 31న తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించేశాడు. దాంతో.. అభిమానులు మరి పెళ్లి ఎప్పుడు..? అని సెటైర్లు పేల్చగా.. మా క్రికెటర్ భలే ఫాస్ట్ అంటూ మరికొందరు వెటకారంగా జోక్‌లు పేల్చారు. కానీ.. ఆ సెటైర్లని హార్దిక్ పట్టించుకోలేదు. అలా అని.. పెళ్లిపై క్లారిటీనీ ఇవ్వలేదు. మౌనంగా ఉండిపోయాడంతే..!

నటాషా ప్రగ్నెన్సీ వార్త నుంచి అభిమానులు తేరుకునేలోపే మరో షాకిస్తూ.. జులై 30న తనకి బాబు పుట్టినట్లు హార్దిక్ ప్రకటించాడు. అప్పుడు కేవలం బాబు తన చేతి వేలిని పట్టుకున్న ఫొటోని మాత్రమే షేర్ చేసిన హార్దిక్.. తాజాగా పూర్తి స్థాయిలో బాబుని తన చేతుల్లోకి తీసుకున్న ఫొటోని ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. అందులో ‘దేవుడి ఆశీర్వాదం’ అని రాసుకొచ్చాడు. 2017 చివర్లో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మకి పెళ్లి అవగా.. వారికి ఇంకా పిల్లలు పుట్టలేదు. దాంతో.. కోహ్లీ, హార్దిక్ మధ్య పోలికల్ని తెస్తూ అభిమానులు జోక్‌లు వేస్తున్నారు.