బాలయ్య సినిమాలో అల్లరోడు?.. అంచనాలు పెంచేస్తున్న బోయపాటి

Share Icons:
సింహా, లెజండ్ చిత్రాల తరువాత బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్లో మూడో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బీబీ3 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి రోజుకో కొత్త అప్‌డేట్ వస్తోంది. లాక్‌డౌన్‌కి ముందే షూటింగ్ ప్రారంభం కాగా.. ఇటీవల బాలయ్య పుట్టినరోజు కానుకగా విడుదల చేసిన టీజర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. బాలయ్య ఒక్క డైలాగ్‌తోనే సినిమాపై అంచనాలను పెంచేశారు.

Also Read:

ఈ సినిమా ద్వారా ఓ కొత్త హీరోయిన్‌ని పరిచయం చేయబోతున్నట్లు దర్శకుడు గతంలోనే వెల్లడించిన సంగతి తెలిసిందే. మరో పాత్రలో సీనియర్ హీరోయిన్ సిమ్రాన్‌ నటిస్తున్నట్లు వార్తలొచ్చారు. తాజాగా మరో వార్త బాలయ్య అభిమానులను అలరిస్తోంది. ప్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఓ ఎపిసోడ్‌లో ఉండే కీలక పాత్రలో అల్లరి నరేష్ నటించనున్నట్లు తెలుస్తోంది.

Also Read:

ఈ పాత్రకు ముందు నుంచి నవీన్ చంద్ర పేరు వినిపించింది. కానీ తాజాగా అల్లరి నరేష్ పేరు తెరపైకి వచ్చింది. ఆ పాత్ర అల్లరోడికి నచ్చినా తన నిర్ణయాన్ని ఇంకా చెప్పలేదని టాక్. ఇటీవల హీరోగా వరుస ఫెయిల్యూర్స్ చూస్తున్న అల్లరి నరేష్ ఇతర హీరోలతో తెరను పంచుకుంటూ కొత్త అవతారం ఎత్తాడు. ‘మహర్షి’ సినిమాలో మహేష్‌బాబు స్నేహితుడు రవి పాత్రలో అతడి అభినయం అందరినీ ఆకట్టుకుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే బోయపాటి ఆ కీలక పాత్రను అతడిని సంప్రదించినట్లు తెలుస్తోంది.

Also Read: