బాలయ్యకు బర్త్‌డే గిఫ్ట్.. పవర్‌ఫుల్ టైటిల్‌తో వస్తోన్న బోయపాటి!

Share Icons:
నటసింహా నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు మరో 10 రోజుల్లో రాబోతోంది. ఈ పుట్టినరోజునాడు తన అభిమానులకు అదిరిపోయే ఫీస్ట్ ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇది బాలయ్య 106వ చిత్రం. ఈ సినిమా టైటిల్‌ను, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారట దర్శక నిర్మాతలు. ఈ సినిమా కోసం బోయపాటి శ్రీను పవర్‌ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేశారని టాక్. అదేంటంటే ‘మోనార్క్’.

సాధారణంగా బాలకృష్ణ సినిమా టైటిల్స్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. బోయపాటి దర్శకత్వంలో బాలయ్య చేసిన రెండు సినిమాలకు ‘సింహా’, ‘లెజెండ్’ అనే పవర్‌ఫుల్ టైటిళ్లు పెట్టారు. అందుకే, ఈసారి కూడా టైటిల్ చాలా పవర్‌ఫుల్‌గా ఉండాలని ‘మోనార్క్’ ఫిక్స్ చేశారట. కథకు కూడా ఈ టైటిల్ చక్కగా సరిపోతుందని దీన్నే ఖరారు చేసుకున్నారట బోయపాటి, బాలయ్య. ‘మోనార్క్’ టైటిల్‌ను ఇప్పటికే ఫిల్మ్ ఛాంబర్‌లో రిజిస్టర్ చేయించారని అంటున్నారు. అంటే, జూన్ 10న నందమూరి అభిమానులకు సంబరాలే.

Also Read:

కాగా, ఈ సినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్‌ను పూర్తిచేసుకుంది. లాక్‌డౌన్ కారణంగా ఇప్పటి వరకు షూటింగ్ జరగలేదు. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే మళ్లీ షూటింగ్ మొదలవుతుంది. ప్రస్తుతానికి ఈ సినిమాలో ఇంకా హీరోయిన్‌ను ఖరారు చేయలేదు. హీరోయిన్ కోసం ఇప్పటికే పాయల్ రాజ్‌పుత్, నయనతార, కేథరిన్, శ్రియా పేర్లను పరిశీలించినట్టు చెబుతున్నారు. అలాగే, ఈ సినిమాలో హీరో వేణు కీలక పాత్ర పోషిస్తున్నారట. బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని టాక్. దీనిలో అఘోర పాత్ర కూడా ఉందని సమాచారం.