`బాక్సర్‌`గా వరుణ్‌.. బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్‌ గిఫ్ట్‌

Share Icons:
ఇటీవల గద్దలకొండ గణేష్‌తో సూపర్‌ హిట్ అందుకున్న యంగ్ హీరో వరుణ్ తేజ్‌ మరో ఇంట్రస్టింగ్ సినిమాకు రెడీ అవుతున్నాడు. కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్‌ డ్రామాలో నటిస్తున్నాడు వరుణ్‌. బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఫ్యాన్‌ మేడ్ పోస్టర్‌ ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

జనవరి 19న బర్త్‌డే సందర్బంగా టైటిల్‌ లోగోతో పాటు వరుణ్‌ ఫెరోసియస్‌ లుక్‌తో ఓ పోస్టర్‌ను డిజైన్‌ చేసి రిలీజ్ చేశారు ఫ్యాన్స్‌. ఈ పోస్టర్‌లో బాక్సింగ్‌ సాధన చేస్తున్న వరుణ్‌ లుక్‌కు సూపర్బ్ రెస్పాన్స్‌ వస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు వెంకటేష్‌, సిద్ధు ముద్దాలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కిరణ్‌ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

Also Read:

ఈ సినిమా కోసం చాలా రోజులుగా బాక్సింగ్‌ ప్రాక్టిస్‌ చేయటంతో పాటు ఫిట్‌నెస్‌ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు వరుణ్‌ తేజ్‌. సినిమా కోసం వరుణ్‌ ఎంత కష్టపడుతున్నాడో ఈ పోస్టర్ చూస్తేనే తెలుస్తోంది. ప్రస్తుతం బాక్సింగ్‌లో మరింత నైపుణ్యం కోసం వరుణ్‌ ముంబై వెళ్లినట్టుగా తెలుస్తోంది. అక్కడ ప్రొఫెషనల్‌ నీరజ్‌ గోయత్‌ పర్యవేక్షణలో వరుణ్‌ బాక్సింగ్‌ ప్రాక్టిస్‌ చేయనున్నాడు.

Also Read:

నీరజ్‌ గోయత్‌ గతంలో బాక్సింగ్‌లో ఒలిపింక్‌ గోల్డ్‌ మెడల్‌ సాధించిన టోని జెఫ్రీస్‌కు శిక్షణ ఇచ్చాడు. అంతేకాదు భారత్ తరుపున డబ్ల్యూబీసీ వరల్డ్ ర్యాకింగ్స్‌లో స్థానం సంపాదించిన తొలి బాక్సర్‌ కూడా నీరజే. ఈయన పర్యవేక్షణలో కొన్ని పోస్టర్లతో పాటు ఫిజికల్ ఫిట్నెస్‌కు సంబంధించిన ట్రైనింగ్‌ కూడా తీసుకోనున్నాడు వరుణ్‌.

See Photo Story: