బర్త్ డే సందర్భంగా ఆ పనితో, ఆదర్శంగా నిలిచిన క్రికెటర్

Share Icons:
భారత క్రికెటర్ తాజాగా 35వ ప‌డిలోకి ప్రవేశించాడు. 1985 మార్చి 26న జన్మించిన కేదార్ జాదవ్ తాజాగా పూణేలో త‌న బర్త్ డేను జ‌రుపుకున్నాడు. ఇక‌, బర్త్ డే సందర్భంగా ఆయన చేసిన పని అందరి ప్రశంసలు అందుకొంది. స్థానిక ఎన్జీవో బ్లడ్ సేవా పరివార్‌కు వచ్చి, రక్త‌దాన‌మిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. పుట్టినరోజు సందర్భంగా జాదవ్ చేసిన ఈ పనిని అందరూ కొనియాడుతున్నారు. మరోవైపు బ్లడ్ సేవా పరివార్ తాజాగా తన ట్విటర్ అకౌంట్‌లో జాద‌వ్ ర‌క్త‌దాన‌మిస్తున్న ఫోటోలను పోస్ట్ చేసింది.

Read Also:

నిజానికి జాద‌వ్ ఈ సమయంలో చెన్నైలో ఉండాల్సి ఉంది. గతేడాది ఐపీఎల్‌ రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ నిర్వహించిన ప్రాక్టీస్ స్టేషన్లో తను గ‌త‌నెల నుంచి పాల్గొన్నాడు. ఈ క్యాంప్‌లో జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీ, ఇతర ఆటగాళ్లు మురళీ విజయ్, హర్భజన్ సింగ్, కర్ణ్‌ శర్మ, సురేష్ రైనా, సాయికిశోర్‌, జగదీశ‌న్ త‌దిత‌రులు పాల్గొన్నారు. అయితే కరోనా వేరస్‌ నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను ఈనెల 29 నుంచి వచ్చే నెల 15 కు వాయిదా వేయడంతో.. చెన్నై తన క్యాంపును కూడా రద్దు వేసింది. దీంతో సొంత గడ్డ పుణేకు చేరుకున్న జాదవ్ బర్త్‌డేను జరుపుకున్నాడు.

Read Also:
మ‌రోవైపు కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజాగా 21 రోజుల లాక్‌డౌన్‌ను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఏప్రిల్ 14 వరకు దేశవ్యాప్తంగా ఎలాంటి కార్యకలాపాలకు చోటు ఉండదు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 15 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. మరోవైపు కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ కార్యకలాపాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే.