బన్సీ సినిమాపైనే ఆశలు పెట్టుకున్న రష్మిక.. అంత ఎగ్జయిట్‌మెంట్ ఎందుకో!

Share Icons:
అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప’పై టాలీవుడ్‌లో భారీ అంచనాలున్నాయి. రంగస్థలం తర్వాత , అల వైకుంఠపురములో తర్వాత బన్నీ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో భారీ హైప్ క్రియేట్ అయింది. దీనికి తోడు బన్నీ గంధపు చెక్కల స్మగ్లర్‌గా నటిస్తుండటం మరో విశేషం. బన్నీ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని సుకుమార్‌ దీన్ని పాన్ ఇండియా సినిమాగా తీర్చిదిద్దుతున్నాడు.

Also Read:

ఈ చిత్రంలో కన్నడ భామ రష్మిక మందాన హీరోయిన్‌గా నటిస్తోంది. తన క్యూట్ లుక్స్‌తో ప్రేక్షకులను గిలిగింతలు పెట్టే రష్మిక ఈ సినిమాతో మరో మెట్టుకు ఎక్కేలాగే కనిపిస్తోంది. దీనికి తోడు తొలిసారి పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నానన్న సంతోషంగా బాగా ఎగ్జయిట్‌మెంట్‌కు గురవుతోందట. అల్లు అర్జున్‌ పక్కన నటించడమే లక్కీ అనుకుంటే.. తొలిసారి పాన్ ఇండియా చిత్రంలో కనిపిస్తుండటంతో ఆమె ఎక్కడా ఆగడం లేదని ఇండస్ట్రీ టాక్.

Also Read:

మరోవైపు ఈ చిత్రంలో రష్మిక గిరిజన యువతిగా డీ గ్లామర్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు గ్లామర్ పాత్రలకు పరిమితమైన తనకు ‘పుష్ప’తో టాలెంట్ నిరూపించుకునే అవకాశం దక్కిందని ఈ ముద్దుగుమ్మ సంబరపడిపోతుందట. సినిమాలో బరువైన పాత్ర దక్కడంతో తాను ఎలివేట్ కావడం ఖాయమని, దీంతో తనకు మరిన్ని అవకాశాలు దక్కుతాయని రష్మిక ఎన్నో ఆశలు పెట్టుకుందట.