బన్నీ కొత్త సినిమా అప్‌డేట్ ఇచ్చిన డైరెక్టర్‌ సుకుమార్

Share Icons:
స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్ ప్రస్తుతం అల వైకుంఠపురములో సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాడు. సంక్రాంతి బరిలో జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల వైకుంఠపురములో సినిమాకు పాజిటివ్‌ టాక్‌ రావటంతో బన్నీ చాలా హ్యాపీగా ఉన్నాడు. సక్సెస్‌ సెలబ్రేషన్స్‌తో పాటు ప్రమోషన్‌ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నాడు.

అయితే ఇప్పటికే చేయబోయే తదుపరి చిత్రం ప్రారంభమైంది. సుకుమార్ దర్శకత్వంలో తన నెక్ట్స్ సినిమా ఉంటుందని అల్లు అర్జున్‌ చాలా కాలం కిందటే ప్రకటించాడు. అంతేకాదు అల్లు అర్జున్‌ లేకుండా ఈ సినిమా ఒక షెడ్యూల్‌ షూటింగ్ కూడా పూర్తయ్యింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్‌ ఇచ్చాడు దర్శకుడు సుకుమార్‌.

Also Read:

సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు పశ్చిమ గోదావరి జిల్లాలోని తన సొంత గ్రామానికి వెళ్లిన సుకుమార్‌ అక్కడి మీడియాతో మాట్లాడు. ఈ సందర్భంగా త్వరలోనే బన్నీ సినిమా రెండో షెడ్యూల్‌ ప్రారంభమవుతుందని తెలిపాడు. ఫిబ్రవరి తొలి వారంలో ప్రారంభం కానున్న ఈ షెడ్యూల్‌లో బన్నీ కూడా షూటింగ్‌లో పాల్గొంటాడని క్లారిటీ ఇచ్చాడు.

అల్లు అర్జున్‌ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ భారీగా నిర్మిస్తోంది. సుకుమార్ ఆస్థాన సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతమందిస్తున్నాడు. గందపు చెక్కల స్మగ్లింగ్‌ నేపథ్యంలో ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Also Read:

ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల వైకుంఠపురములో సినిమాలో బన్నీకి జోడిగా పూజా హెగ్డే నటించింది. మాటల మాంత్రికుడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను అల్లు అరవింద్‌, రాధకృష్ణలు సంయుక్తంగా గీతా ఆర్ట్స్‌, హారికా హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌లపై నిర్మించారు. సుశాంత్, నివేదాపేతురాజ్‌, టబు, జయరామ్‌, ఇతర కీలక పాత్రల్లో నటించారు.