బన్నీ అభిమానులకు మరో సర్‌ప్రైజ్ ఇవ్వనున్న తమన్

Share Icons:
అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ హ్యాట్రిక్ మూవీ తెరకెక్కిన ‘’ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బన్నీ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలవడంతో పాటు మ్యూజికల్‌గానూ ఎన్నో రికార్డులను తిరగరాసింది.

Also Read:

సామజవరగమణ, బుట్టబొమ్మ, రాములో రాములా… పాటలు యూట్యూబ్‌ రికార్డులను తిరగరాస్తూనే ఉన్నాయి. ‘నా పేరు సూర్య’ పరాజయంతో నిరాశలో కూరుకుపోయిన బన్నీ ఫ్యాన్స్‌ ‘అల వైకుంఠపురములో’ సినిమాతో కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నారు.


తాజాగా ఇప్పుడు ఈ సినిమా నుండి బన్నీ ఫ్యాన్స్‌కు తమన్‌ మరో సర్‌ప్రైజ్‌ను ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఈ విషయాన్ని తనే స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఫ్యాన్స్ కోరిక మేరకు ఈ చిత్రానికి సంబంధించిన ఒరిజినల్‌ సౌండ్‌ ట్రాక్‌ను త్వరలోనే విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

Also Read: