బన్నీకి తిరుగులేదు.. బుట్టబొమ్మకి ఎదురులేదు, దిమ్మతిరిగే మరో రికార్డ్

Share Icons:
క్రికెటర్లకు గ్రౌండ్‌లో సిక్స్‌లు బాదడం.. బంతిని బౌండరీలకు పంపడం అలవాలు.. అలాంటి క్రికెటర్లనే బొంగరాల్లా తిప్పేసింది ఈ . డేవిడ్ వార్నర్, కెవిన్ పీటర్సన్ లాంటి భయంకర బ్యాట్స్‌మెన్స్‌తో స్టెప్పులు వేయించిన బుట్టబొమ్మ సాంగ్.. రోజుకో హిస్టరీ క్రియేట్ చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది ఈ బుట్ట బొమ్మ పాట.

తమన్ స్వరపరిచిన ట్యూన్‌కి.. జానీ మాస్టర్ స్టైలిష్ కొరియోగ్రఫీ తోడు కావడం.. ఇలాంటి స్టైలిష్ స్టెప్పుల్ని స్టైలిష్ స్టార్ ఇంకా స్టైలిష్‌గా చేయడంతో బుట్టబొమ్మ సాంగ్ ప్రతి ఒకర్నీ బొంగరంలా తిప్పేస్తోంది. చిన్న పిల్లల దగ్గర్నుంచి ముసలి బామ్మలు సైతం నడుము పట్టుకుని బుట్టబొమ్మల్లా మారిపోతున్నారంటే ఈ సాంగ్ జనంలోకి ఎంత బలంగా వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు.

యూట్యూబ్‌లో మిలియన్ దగ్గర ప్రారంభమైన బుట్టబొమ్మ ఊచకోత.. 10 మిలియన్.. 100 మిలియన్.. 150 మిలియన్.. 200 మిలియన్.. 250 మిలియన్ అంటూ మిలియన్ల వేట కొనసాగిస్తున్న ఈ పాట తాజాగా 300 మిలియన్ల క్లబ్‌లో చేరింది. ఇందులో 2 మిలియన్ లైక్స్ ఉండటం గమనార్హం. బుట్టబొమ్మ సాంగ్ 300 క్లబ్‌లో చేరడంతో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తూ అఫీషియల్ పోస్టర్‌ను విడుదల చేసింది.