‘బంగారు బుల్లోడు’ టీజర్: బొడ్డు కనకమహాలక్ష్మి.. ఇంటిపేరు ఒంట్లోనే పెట్టేసుకుంది!

Share Icons:
అల్లరి నరేష్, పూజా ఝవేరి హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘బంగారు బుల్లోడు’. పి.వి.గిరి దర్శకత్వం వహిస్తున్నారు. ఏటీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఉగాది పండుగనాడు విడుదల చేసిన ‘బంగారు బుల్లోడు’ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. అంతేకాకుండా, నందమూరి బాలకృష్ణ సూపర్ చిత్రం ‘బంగారు బుల్లోడు’ టైటిల్‌తో నరేష్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. కాగా, పుట్టినరోజు సందర్భంగా జూన్ 30న ‘బంగారు బుల్లోడు’ టీజర్‌ను‌ విడుదల చేశారు.

టీజర్ చూస్తుంటే ఇది మంచి కామెడీ ఎంటర్‌టైనర్ అని అర్థమవుతోంది. ఇందులో నరేష్ బ్యాంక్ ఉద్యోగిగా కనిపించనున్నారు. బ్యాంక్ లాకర్‌లో ఉన్న కస్టమర్ల బంగారు ఆభరణాలు, నరేష్ పాత్ర చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందని టీజర్ ద్వారా స్పష్టమవుతోంది. ‘‘బొడ్డు కనకమహాలక్ష్మి.. ఇంటిపేరు ఒంట్లోనే పెట్టేసుకుంది’’ అని నరేష్ చెప్పే డైలాగ్ సినిమాలోని రొమాంటిక్ యాంగిల్‌ను చూపిస్తోంది.

Also Read:

పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నరేష్ పాత్ర ఆద్యంతం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. నిజానికి ఈ సినిమా వేసవిలో విడుదలకావాల్సింది. కానీ, లాక్‌డౌన్ కారణంగా ఆగిపోయింది. థియేటర్లు తెరుచుకున్న తరవాత సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. కాగా, ఈ సినిమాలో తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, పృథ్వీ, ప్రవీణ్, వెన్నెలకిషోర్, సత్యం రాజేష్, ప్రభాస్ శ్రీను, జబర్దస్త్ మహేష్, అనంత్, భద్రం, అజయ్ ఘోష్, సారిక రామచంద్రరావు, రమాప్రభ, రజిత, శ్యామల ఇతర పాత్రలు పోషించారు.