ఫ్యా‌న్స్ వల్లే ఏ ఆటకైనా గ్లామ‌ర్: రోహిత్ శ‌ర్మ‌

Share Icons:
భార‌త వైట్‌బాల్ క్రికెట్ వైస్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ.. అభిమానుల‌పై ప్ర‌శంస‌ల జల్లు కురిపించాడు. ఏ క్రీడకైనా అభిమానులు అదనపు హంగులు తీసుకొస్తార‌ని, వాళ్లే గ్లామ‌ర‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. క‌రోనా వైర‌స్ విస్త‌ర‌ణ కార‌ణంగా క్రికెట‌ర్లంతా ఇంటికే ప‌రిమిత‌మైన సంగ‌తి తెలిసిందే. అభిమానుల‌తో ట‌చ్‌లో ఉండ‌టం కోసం చాలామంది సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే రోహిత్ శ‌ర్మ.. అభిమానుల గురించి మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టాడు.

Must Read:
క‌రోనా కార‌ణంగా కొంత‌కాలంపాటు ఖాళీ స్టేడియాల్లోనే మ్యాచ్‌లు జ‌రిగే అవ‌కాశ‌ముంది. క‌రోనా నుంచి ర‌క్ష‌ణ పొందాలంటే ఈ మార్పు తప్ప‌నిస‌రి అని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చాక‌, ప‌రిస్థితిలో మార్పు ఉంటుందని అంతా ఆశిస్తున్నారు. మరోవైపు ప్ర‌తి ఒక్క‌రి ర‌క్ష‌ణ‌ను దృష్టిలో పెట్టుకుని త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల్సి ఉంద‌ని రోహిత్ వ్యాఖ్యానించాడు.

Must Read:
అప్ప‌టికి ప‌రిస్థితి కాస్త కుదుట‌ప‌డితే స్టేడియంలోకి అభిమానుల‌ను మెల్లిమెల్లిగా అనుమతించే అవ‌కాశ‌ముంటుంద‌ని రోహిత్ భావిస్తున్నాడు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా లాక్‌డౌన్‌లో స‌డ‌లింపుల‌ను ఇస్తుండ‌టంతో క్రీడా కార్య‌క‌లాపాల‌ను తిరిగి ప‌ట్టాల‌కెక్కించాల‌ని వివిధ దేశాల బోర్డులు భావిస్తున్నాయి. ఇప్ప‌టికే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు త‌మ ప్లేయ‌ర్ల‌కు ట్రైనింగ్ ప్రారంభించింది. మ‌రోవైపు భార‌త పేస‌ర్ శార్దూల్ ఠాకూర్ కూడా బ‌హిరంగంగా త‌న ప్రాక్టీస్‌ను కూడా స్టార్ చేశాడు.