ఫోటోగ్రాఫర్‌ను టీజ్‌ చేసిన ఎన్టీఆర్‌.. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఫన్నీ సీన్

Share Icons:
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్న యంగ్ టైగర్‌ సడన్‌గా ముంబై ఎయిర్‌ పోర్ట్‌లో ప్రత్యక్షమయ్యాడు. యాపీ ఫిజ్‌కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న తారక్‌ దానికి సంబంధించిన ఓ యాడ్‌ షూట్‌ కోసం ముంబై వెళ్లాడు. అయితే ఆ సమయంలో ఓ ఫోటోగ్రాఫర్‌ తారక్‌ను ఫోటోలు తీసేందుకు ప్రయత్నించిన సందర్భంలో ఎన్టీఆర్‌ వ్యవహరించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

తనను ఫోటోలు తీసేందుకు ప్రయత్నిస్తున్న ఓ ఫోటోగ్రాఫర్‌ను దగ్గరికి పిలిచిన ఎన్టీఆర్‌.. `నువ్వు ఇక్కడే ఉంటావా..? తిండి, స్నానం అన్నీ ఇక్కడేనా?` అంటూ సరదాగా కామెంట్ చేశాడు. గతంలోనూ ఎన్టీఆర్‌ ముంబై వెళ్లి సమయంలో ఆ ఫోటోగ్రాఫర్‌ను చూశాడు. ఈ విషయం గుర్తుపెట్టుకొని ఈ సారి దగ్గరకు పిలిచి మరి విచారించాడు.

Also Read:

ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్‌ఆర్‌ సినిమాలో నటిస్తున్నాడు ఎన్టీఆర్‌. ఈ సినిమాలో ఎన్టీఆర్‌తో పాటు మరో హీరోగా నటిస్తున్నాడు. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడిగా హాలీవుడ్‌ భామ ఒలివియా మోరీస్‌ నటిస్తోంది.

ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను జూలై 30న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే నిర్మాణ కార్యక్రమాలు ఆలస్యమైతే అక్టోబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓసినిమా చేసేందుకు ఎన్టీఆర్‌ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాను 2021 సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Also Read: