ప్రియుడితో కలిసి సొంతింటికే కన్నం, షూటింగ్స్‌ లేక దొంగగా మారిన నటి

Share Icons:
కరోనా వైరస్ దెబ్బకు అందరి జీవితాలు తలకిందులు అయిపోయాయి. గతంలో దర్జాగా బ్రతికిన వారు కూడా ఇప్పుడు ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. రంగుల ప్రపంచమైన వెండితెర, బుల్లితెరను నమ్ముకున్న చాలామంది కూడా లాక్‌డౌన్‌లో తినడానికి తిండి కూడా లేక కష్టాలు పడ్డారు. ఈ కోవలోనే కరోనా వల్ల ఓ తమిళ నటి దొంగగా మారింది. ప్రియుడితో కలిసి అతడి ఇంట్లోనే దొంగతనానికి పాల్పడి అడ్డంగా బుక్కైంది. జిల్లాలో జరిగిన ఈ ఘటన తమిళ బుల్లితెర ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది.

Also Read:

తమిళనాడుకు చెందిన సుచిత్రా అనే యువతి అనేక టీవీ సీరియళ్లలో నటించింది. దేవత అనే సీరియల్‌ ఆమెకు మంచిపేరు తెచ్చిపెట్టింది. డ్రైవర్‌గా పనిచేస్తున్న మణికందన్ అనే వ్యక్తితో కొంతకాలం క్రితం పరిచయం ఏర్పడింది. అతడికి వివాహమైందని తెలిసి కూడా సుచిత్ర సహజీవనం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే లాక్‌డౌన్ కారణంగా షూటింగులు ఆగిపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతోంది. మణికందన్ ఇంట్లో భారీగా బంగారు ఆభరణాలు, నగదు ఉందని తెలుసుకున్న చోరీకి ప్లాన్ వేసింది. ప్రియురాలి మాట కాదనలేక మణికందన్‌ తన ఇంట్లోనే దొంగతనం చేసేందుకు ఒప్పుకున్నాడు.

Also Read:

సుచిత్ర ప్లాన్ ప్రకారం మణికందన్ కడలూరు జిల్లా పన్రుతిలో తన స్వగ్రామానికి చేరుకున్నారు‌. తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఉన్న 18 సవర్ల బంగారంతో పాటు రూ.50వేల నగదు దొంగిలించాడు. ఇంట్లో డబ్బు, బంగారం కనిపించకపోవడంతో మణికందన్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇది ఇంటి దొంగ పనేనని తేల్చి మణికందన్‌ను అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న సుచిత్ర పరారైంది. దీంతో పోలీసులు ఆ నటి కోసం గాలిస్తున్నారు.