ప్రభాస్ సినిమాలో రానా.. గోపీచంద్‌కు కుదరకపోవడంతో..!!

Share Icons:
బాహుబలిగా ప్రభాస్‌, భళ్లాలదేవుడిగా రానా వెండితెరపై ప్రేక్షకులకు కనువిందు చేశారు. వీరిద్దరూ కలిసి నటించిన ‘బాహుబలి’ సిరీస్ బాక్సాఫీసు వద్ద రికార్డుల వర్షం కురిపించింది. మాహిష్మతి సింహాసనం కోసం వీరిద్దరూ పోరాడిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే, ‘బాహుబలి’ తరవాత మరోసారి వీరిద్దరూ కలిసి నటించబోతున్నారని ఇండస్ట్రీ టాక్. రాధాకృష్ణ దర్శకత్వంలో హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో రానా దగ్గుబాటి ఒక ప్రత్యేక పాత్రలో మెరవనున్నారని అంటున్నారు. రానా పాత్ర రెండు నిమిషాల పాటు ఉంటుందని తెలుస్తోంది. దీంతో రానా, ప్రభాస్ మరోసారి కలిసి నటిస్తు్న్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకు ‘రాధే శ్యామ్’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. లాక్‌డౌన్‌కు ముందు ఈ చిత్ర యూనిట్ జార్జియాలో షూటింగ్ జరిపిన విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్, పూజా హెగ్డే‌తో పాటు ప్రియదర్శి కూడా పాల్గొన్నారు. కరోనా విజృంభిస్తోన్న సమయంలోనే ఈ మూవీ టీమ్ మొత్తం ఇండియాకు తిరిగి వచ్చింది. ప్రస్తుతం షూటింగ్‌లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో మిగిలిన భాగం షూటింగ్‌ను పూర్తిచేయాలని మేకర్స్ చూస్తున్నారు.

Also Read:

అయితే, ఈ సినిమాలో 2 నిమిషాల నిడివితో ఒక ప్రత్యేకమైన పాత్ర ఉందట. ఈ పాత్రలో నటించడానికి ముందు గోపీచంద్‌ను అనుకున్నారట ప్రభాస్. గోపీచంద్, ప్రభాస్ మంచి స్నేహితులు. ఈ చొరవతోనే గోపీని ప్రభాస్ అడిగారట. గోపీచంద్ అంగీకరించినా అనుకోని కారణాల వల్ల ఈ సినిమాలో నటించడం కుదరడంలేదట. దీంతో ప్రభాస్‌కు మరో ఆప్షన్ కింద రానా కనిపించారని అంటున్నారు. గోపీచంద్ చేయాల్సిన పాత్రను ఇప్పుడు రానా చేస్తున్నారని టాక్. ప్రస్తుతం వినిపిస్తోన్న ఈ వదంతుల్లో నిజమెంతో తెలియాలంటే కొన్ని రోజులు అయినా ఆగాలి.. లేదంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకైనా వేచి చూడాలి.