ప్రభాస్ ఫ్యాన్స్‌కి షాకింగ్ న్యూస్.. రేసు నుంచి రెబల్ స్టార్ అవుట్! ఇప్పట్లో కష్టమే..

Share Icons:
దేశ విదేశాల్లో భారీ పాపులారిటీ సంపాదించిన .. తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ కూడగట్టుకున్నారు. తెలుగుతో పాటు హిందీ ఆడియన్స్‌ని కూడా ఫిదా చేసి ప్యాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఇటీవలే ‘సాహో’ రూపంలో అభిమానులకు కాస్త నిరాశ మిగిల్చిన ఆయన, ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.

‘‘బాహుబలి, సాహో’’ లాంటి భారీ సినిమాల తర్వాత వస్తున్న ఈ సినిమాను కూడా భారీ స్థాయిలోనే నిర్మిస్తున్నారు. అభిమానుల అంచనాలను మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. రొమాంటిక్ జోనర్‌లో రాబోతున్న ఈ సినిమాను గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రభాస్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను కూడా ప్యాన్ ఇండియా మూవీ గానీ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ 2020లోనే విడుదలవుతుందని అంతా భావించారు. కానీ లాక్‌డౌన్ కారణంగా షూటింగ్స్ వాయిదా పడటంతో ఈ సంవత్సరం విడుదల కావడం జరిగే పని కాదని సమాచారం.

Also Read:
ఈ ఏడాది కాకపోయినా కనీసం వచ్చే ఏడాది ఆరంభంలో సంక్రాంతి రేసులో అయినా నిలుస్తుందనుకుంటే అది కూడా కష్టమే అని చిత్ర వర్గాల నుంచి అందుతున్న సమాచారం. 2021 ద్వితియార్థంలోనే ఈ మూవీ రిలీజ్ ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ వార్తలు చూసి యంగ్ రెబర్ స్టార్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. అంతేకాదు ఒక్క అప్‌డేట్ ఇవ్వడం లేదని నిర్మాణ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

1960 దశకం నాటి ప్రేమకథతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ ప్యూర్ రొమాంటిక్ పాత్రలో నటిస్తున్నారట. ప్రభాస్- పూజా మధ్య నడిచే రొమాంటిక్ సీక్వెన్స్ ప్రేక్షకులను కనువిందు చేయనుందట. చిత్రానికి ‘ఓ డియర్’ అనే పేరు పరిశీలిస్తున్నారు. మొత్తానికైతే.. ఇప్పటికే ఈ సినిమా విడుదల ఆలస్యం అవుతోందని బాధపడుతున్న ప్రభాస్ అభిమానులను ఈ న్యూస్ మరింత నిరాశ పర్చింది.