ప్రభాస్‌ భారీ ప్రాజెక్టులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. డీల్ సెట్ చేసిన నాగ్ అశ్విన్!

Share Icons:
యంగ్ రెబల్ స్టార్ హీరోగా ‘మహానటి’ ఫేమ్ దర్శకత్వంలో కొత్త సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన రావడంతో తెలుగు ప్రేక్షకుల దృష్టంతా ఈ మూవీపైనే పడింది. మరోవైపు సోషల్ మీడియాలో వస్తున్న ఈ చిత్ర అప్‌డేట్స్ ప్రేక్షకుల్లో సరికొత్త ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. సోషియో ఫాంటసీ మూవీగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.

ప్రభాస్‌ కోసం భారీ కథను సిద్ధం చేసిన నాగ్ అశ్విన్.. 400 కోట్లతో ప్యాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను రూపొందించనున్నారట. ఈ మేరకు నిర్మాత అశ్వినీదత్‌తో కూడా చర్చలు ముగిశాయని టాక్. ఇకపోతే ఈ సినిమాను నవంబర్ నెలలో సెట్స్ మీదకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్న దర్శకనిర్మాతలు.. ప్రభాస్ సరసన నటించబోయే హీరోయిన్, ఇతర నటీనటుల విషయమై ఫైనల్ డిసీజన్ తీసుకుంటున్నారట.

Also Read:
ఈ క్రమంలోనే ప్రభాస్ సరసన బాలీవుడ్ హీరోయిన్‌ని ఫిక్స్ చేయాలని ప్లాన్ చేశారట. అయితే మొదట ఆలియా భట్ అనుకున్న డైరెక్టర్ నాగ్ అశ్విన్.. ఫైనల్‌గా దీపిక పదుకొనెతో డీల్ సెట్ చేశారని వార్తలు వస్తున్నాయి. మరోవైపు ‘మహానటి’ సినిమాను అందరూ చూడండి అని దీపిక పోస్ట్ పెట్టడం, తెల్లవారుజామున కూల్ నోటిఫికేషన్ అందుకున్నాను అంటూ నాగ్ అశ్విన్ తన సోషల్ మీడియా పేజ్‌లో రాయడం ఆ వార్తలకు బలాన్నిస్తున్నాయి. సో.. చూడాలి మరి ప్రభాస్- దీపిక జోడీ సెట్ అవుతుందో లేదో అనేది.