ప్రతి ప్రేక్షకుడి మీద ఆ బాధ్యత ఉంది.. అప్రమత్తంగా ఉండండి: నందమూరి బాలకృష్ణ

Share Icons:
సినిమా ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న భూతం పైరసీ. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీస్తే ఆ కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేస్తుంటారు పైరసీ రాయుళ్లు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తమ పనిలో తాముండి ఎలాగోలా కొత్త సినిమా ప్రింట్ అనధికారికంగా బయటకు వదులుతుంటారు ఆన్‌లైన్ కేటుగాళ్లు. దీంతో ఈ పైరసీ నిర్మూలనకై ఇటు ప్రభుత్వం, అటు సినీ పెద్దలు జనాల్లో పెద్దఎత్తున అవగాహన కల్పిస్తున్నారు. పైరసీ కేటుగాళ్లకు కళ్లెం వేయాల్సిన అవసరముందని ప్రేక్షకులకు తగు సూచనలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తన వాయిస్ ఇచ్చారు.

తెలుగు ప్రేక్షక దేవుళ్లందరికీ హృదయపూర్వక కళాభివందనాలు అంటూ పైరసీపై అందరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు బాలకృష్ణ. ఈ పైరసీని అరికట్టాలని కోరుతున్నా అని చెప్పారు. ప్రతి ప్రేక్షకుడు, అభిమానిపై కూడా పైరసీ నిర్ములించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు దసరా కానుకగా విడుదలవుతున్న తన హిస్టారికల్ మూవీ ”ను శ్రేయాస్ మీడియా ఈటీలో చూడాలని ఆయన కోరారు.

Also Read:
గత కొన్నేళ్ల క్రిందట కొంతభాగం షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఆగిపోయిన ‘నర్తనశాల’ సినిమాను ఎలాగైనా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచన చేసిన బాలయ్య బాబు.. దాదాపు 17 నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాలను విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. దసరా కానుకగా ఈ నెల 24న శ్రేయాస్ ఈటీ ద్వారా విడుదల చేయబోతున్నారు. సౌందర్య, శ్రీహరి లాంటి దివికేగిన తారలను మళ్లీ భువికి రప్పించడం ఈ చిత్రంతోనే సాధ్యమవుతోందని బాలకృష్ణ తెలిపారు. ఇందులో అర్జునుడిగా బాలకృష్ణ, ద్రౌపదిగా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు కనిపించనున్నారు.