పోలీసుల మాన‌వ‌త్వానికి యువీ సెల్యూట్‌

Share Icons:
క‌రోనా వైర‌స్ కార‌ణంగా 21 రోజ‌లు లాక్‌డౌన్‌ను ప్ర‌కటించ‌డంతో దేశంలోని నిరుపేద‌లు చాలాచోట్ల ఆక‌లితో అల్లాడుతున్న సంగ‌తి తెలిసిందే. వారిని ఆదుకునేందుకు క్రికెట‌ర్లు స‌హా సెలెబ్రిటీలు ముందుకొస్తున్నారు. తాజాగా ఆక‌లితో అల్లాడుతున్న వ్య‌క్తిని ఆదుకున్న పోలీసుల వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌లైంది. తాజాగా ఈ వీడియోను నెట్‌లో షేర్ చేసిన భార‌త మాజీ క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్.. పోలీసుల మాన‌వ‌త్వానికి ఫిదా అయ్యాడు. క‌ష్ట‌కాలంలో వాళ్లు చేసి సాయాన్ని కొనియాడాడు.

Read Also:

మ‌రోవైపు త‌ను షేర్ చేసిన వీడియోలో ఒక కామెంట్‌ను యువీ జ‌త చేశాడు. పోలీసుల మాన‌వ‌త్వాన్ని చూస్తుంటే, త‌న హృద‌యం ఉప్పొంగుతోంద‌ని పేర్కొన్నాడు. ఇలాంటి క‌ఠిన సంద‌ర్భాల్లో తమ ఆహారాన్ని దానం చేసిన వారిని చూస్తుంటే, పోలీసులంటే చాలా గౌర‌వం పెరుగుతోంద‌ని వ్యాఖ్యానించాడు. మ‌రోవైపు ఇటీవ‌ల పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది.. త‌మ దేశంలోని పేద‌ల‌కు సాయం చేయాల‌ని కోర‌గా.. క్రికెట‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్‌తో క‌లిసి యువీ త‌నవంతు సాయం చేశాడు.

Read Also:
మ‌రోవైపు కరోనా వైర‌స్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా రోజురోజుకు విస్త‌రిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు 12 ల‌క్ష‌ల‌కుపైగా పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. అలాగే 66 వేల మందికిపైగా మ‌ర‌ణించారు. ఇక మ‌న‌దేశంలోనూ ఈ వైర‌స్ మ‌హమ్మారి త‌న ప్ర‌తాపం చూపిస్తోంది. ఇప్ప‌టికే క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3500కుపైగా దాటిపోయింది. 99 మంది మ‌ర‌ణించారు.