పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన కిర్తీ సురేష్

Share Icons:
నేను శైలజ అంటూ… తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మళయాళీ ముద్దుగుమ్మ కీర్తి సురేష్. ఆ తర్వాత నేను లోకల్ అంటూ నానితో జతకట్టింది. అయితే ‘మహానటి’తో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాతో ఆమెకు నేషనల్ అవార్డు కూడా అందింది. అయితే… ఈ మధ్య కీర్తి సురేష్ త్వరలో పెళ్లి పీటలెక్కుతుందున్న వార్తలు షికార్లు చేస్తున్నారు. ప్రముఖ రాజకీయ నాయకుడు కుమారుడ్ని ఆమె వివాహం చేసకుంటుందన్న వార్తలు వినిపించాయి. ఇది పెద్దలు నిశ్చయించిన పెళ్లేనంటూ అందరూ చెప్పుకున్నారు. అయితే ఈ వార్తల్ని ఖండించింది దీనిపై తాజాగా క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేష్‌.. వచ్చే ఏడాది వరకు కాల్‌షీట్స్ ఇచ్చాను. ఇలాంటి పరిస్థితులలో పెళ్ళి ఎలా జరుగుతుంది. దయచేసి అవాస్తవాలని, తప్పుడు వార్తలని ప్రచారం చేయోద్దు అని కోరింది కీర్తి.

గతంలో కూడా కిర్తి సురేష్ పెళ్లిపై పుకార్లు వినిపించాయి. ఆమె కమెడియన్ సతీష్‌ను పెళ్లి చేసుకుందన్న వార్తలు హల్ చల్ చేశాయి, కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పట్లో కూడా ఆ వార్తల్ని కిర్తీ సురేష్ ఖండించింది. తనకు ఎలాంటి పెళ్లి జరగలేదని క్లారిటీ ఇచ్చింది. 1992 అక్టోబర్ 17న కిర్తతీ సురేష్ తమిళనాడులో పుట్టింది. కిర్తీ సురేష్ తండ్రి సినీ నిర్మాత, తల్లి మేనక కూడా నటి. 2000 సంవత్సరంలోనే చైల్డ్ ఆర్టిస్ట్‌గా కీర్తి సురేష్ తన కెరియర్‌ను స్టార్ట్ చేసింది. ఫైలట్, అచనికిష్టం, కుబేరన్ వంటి సినిమాల్లో బాల నటిగా మెరిసింది.

మహానటి చిత్రంతో నేషనల్ అవార్డ్ అందుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగులో ‘గుడ్‌లక్‌ సఖీ’ ‘రంగ్‌దే’ చిత్రాల్లో నటిస్తోంది. తాజా సమాచారం ప్రకారం నితిన్‌ కథానాయకుడిగా కృష్ణచైతన్య దర్శకత్వంలో రూపొందించబోతున్న ‘పవర్‌పేట’ చిత్రంలో కూడా కీర్తిసురేష్‌ కథానాయికగా ఖరారైందని సమాచారం.ఇక తమిళంలో అన్నాత్తి, పెంగ్విన్ చిత్రాలలో నటిస్తుంది.