పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్..

Share Icons:
లాక్‌డౌన్ ఏమో గానీ ఈ టైమ్‌లో సెలబ్రిటీల పెళ్లి ముచ్చట్లు హోరెత్తిస్తున్నాయి. ఎక్కువ ఖాళీ సమయం దొరకడంతో మన వెండితెర, బుల్లితెర బ్యాచిలర్స్ అంతా తమ తమ పెళ్లిపై దృష్టి సారించారు. మెల్లగా ఒక్కొక్కరూ పెళ్లికి సంబంధించిన పనులు చేసుకుంటూ మ్యారేజ్ డిసీజన్ తీసుకుంటున్నారు. ఇప్పటికే నిఖిల్ ఓ ఇంటివాడు కాగా.. అదే లైన్‌లో నితిన్ ఉన్నాడు. ఇకపోతే సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ పెళ్లి దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. ఇదిలా ఉంటే బుల్లితెర కింగ్ కూడా అదే బాటలో వెళ్తున్నాడని లేటెస్ట్ సమాచారం.

జబర్దస్త్ కమెడియన్‌గా భారీ పాపులారిటీ సంపాదించిన మ్యాటర్ గురించి ఎప్పటినుంచో వార్తలు వింటున్నాం. మూడు పదుల వయసు దాటడం పైగా, బుల్లితెరపై ప్లే బాయ్ ఇమేజ్ సొంతం చేసుకోవడంతో మనోడి పెళ్లి ముచ్చటనగానే అదో హాట్ ఇష్యూగా మారుతోంది. అంతకుముందు తోటి యాంకర్ రష్మీతో ప్రేమాయణం సాగిస్తున్నాడని, రష్మీ- సుధీర్ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఎన్నో వార్తలు విన్నాం. కానీ వాటిని ఆ ఇద్దరూ ఖండించడంతో ఫుల్‌స్టాప్ పడింది.

Also Read:
అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ లాక్‌డౌన్ సమయమంతా తన పెళ్లి పైనే ఫోకస్ పెట్టాడట జబర్దస్త్ కుర్రోడు సుడిగాలి సుధీర్. అమ్మాయి వేట ప్రారంభించిన ఆయన.. చివరకు ఓ అమ్మాయితో కమిట్ అయ్యాడని తెలుస్తోంది. పెద్దలు చూసిన ఈ సంబంధం సుధీర్‌కి బాగా నచ్చేయడంతో ఓకే అనేశాడని తెలుస్తోంది. ఆ అమ్మాయి కృష్ణా జిల్లాకు చెందిన యువతి అని, దాదాపు పరిచయాలు అయిపోయాయని త్వరలో నిశ్చితార్థంతో ఇరు కుటుంబాలు అఫీషియల్‌గా పెళ్లి పనులు మొదలు పెట్టనున్నారని టాక్.

జబర్దస్త్ వేదికపై పొట్ట చెక్కలయ్యే కామెడీ పండించే సుడిగాలి సుధీర్ అంచెలంచెలుగా ఎదిగి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడగట్టుకున్నాడు. యాంకర్ గా పలు కార్యక్రమాల్లో అలరించాడు. ఇటీవలే హీరోగా కూడా వెండితెరపై కాలుమోపి ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే ఈ మూవీ ఆశించిన ఫలితం రాబట్టలేదు.