పూరి డిసైడ్ చేశారు.. మీరనుకునేది మాత్రం కాదు.. ట్విస్ట్ ఇచ్చిన ఛార్మి

Share Icons:
డాషింగ్ డైరెక్టర్ దర్శకత్వంలో హీరోగా కొత్త సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ముంబై నేపథ్యంలో సాగే ఆసక్తికర కథాంశంతో యూత్ ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా ఈ మూవీ రూపొందుతోంది. చిత్రానికి ‘ఫైటర్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారని షూటింగ్ ప్రారంభం నుంచే చెప్పుకుంటున్నారు. కాగా ఈ చిత్ర నిర్మాణంలో భాగమవుతున్న తాజాగా ఓ ట్విస్ట్ ఇచ్చింది. అందరూ అనుకున్నట్లుగా ఈ సినిమా టైటిల్ ‘ఫైటర్’ కాదని చెప్పేసింది.

”పూరి గారు ఈ సినిమాకు ఎప్పుడో టైటిల్ ఫిక్స్ చేశారు. ‘ఫైటర్’ అనే టైటిల్ అందరూ చెప్పుకుంటున్నారు. కానీ అది మాత్రం కాదు. ఈ లాక్‌డౌన్ ఫినిష్ కాగానే షూటింగ్ ప్రారంభించి.. అతి త్వరలోనే పూరిగారు ఈ మూవీ టైటిల్ ప్రకటిస్తారు” అని చెప్పింది ఛార్మి. దీంతో ఈ సినిమాకు ‘ఫైటర్’ టైటిల్ కాదనే విషయం కన్ఫర్మ్ అయింది. ఈ క్రమంలో చిత్రానికి ‘లైగర్’ అనే టైటిల్ పెట్టినట్లుగా మరో ప్రచారం బయటకొస్తోంది. మగ సింహం, ఆడ పులి సంతానమే ‘లైగర్’. వినడానికి ఆసక్తికరంగా ఉన్న ఈ టైటిల్ కన్ఫర్మ్ చేస్తారా? లేక ఇంకేదైనా ఉందా? అంటే వేచి చూడాల్సిందే మరి.

Also Read:
‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్స్‌పై ధర్మా ప్రొడక్షన్స్ సమర్పిస్తున్న ఈ చిత్ర నిర్మాణంలో కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మాణ భాగస్వాములుగా జాయిన్ కావడం విశేషం. పాన్ ఇండియా సినిమాగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. రొమాంటిక్ డోస్ బాగా పెంచేసి క్లాస్, మాస్ ఆడియన్స్ అందరినీ ఆకట్టుకునేలా ఈ కథను కెమెరాలో బంధిస్తున్నారట పూరి. ఇందులో విజయ్ దేవరకొండ బాక్సర్‌గా కనిపించనున్నారు. ఇటీవలే ముంబైలో ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్ అయింది. లాక్ డౌన్ పూర్తికాగానే మరో షెడ్యూల్ స్టార్ట్ చేసి చకచకా ఫినిష్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట పూరి జగన్నాథ్.