పూజా హెగ్డేపై చిన్నారి కామెంట్స్.. పాప బుగ్గలపై కన్నేసిన హీరోయిన్! బుట్టబొమ్మ క్రేజీ రియాక్షన్

Share Icons:
ఓ చిన్నారి సరదాగా తన ముద్దు ముద్దు మాటలతో హీరోయిన్ పూజా హెగ్డేపై కామెంట్స్ చేయడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎలాగోలా అది హీరోయిన్ పూజా కంటపడింది. దీంతో వెంటనే ఆ వీడియోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసిన పూజా.. ఆ చిన్నారిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. తన గురించి బుల్లి అభిమాని చెప్పిన మాటలకు ఫిదా అవుతూ తెగ మురిసిపోయింది ఈ బుట్టబొమ్మ.

ఈ వీడియోలో.. నీ అభిమాన హీరోయిన్‌ ఎవరు? పెద్దయ్యాక ఏమవుతావు అని ఓ వ్యక్తి ఆ చిన్నారిని ప్రశ్నిస్తుండగా నేను పెద్దయ్యాక హీరోయిన్‌ అవుతా. ఎందుకంటే పూజా హెగ్డే చాలా బాగుంటుంది. నాకు ఆమె అంటే చాలా ఇష్టం అంటూ ముద్దు ముద్దుగా సమాధానాలు ఇస్తూ సరదాగా కనిపించింది చిన్నారి. దీంతో ఈ వీడియో చూసిన పూజా అభిమానులు ఖుషీ అవుతూ నెట్టింట వైరల్ చేసేశారు.

అలా అలా చివరకు పూజా వద్దకు చేరడంతో ఆ వీడియోను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. ”ఈ చిన్నారి వీడియోతో ఈ రోజు సంతోషకరంగా మారి పరిపూర్ణం అయింది. అమ్మాయి బుగ్గలు ఎంత బాగున్నాయో..! ఇంతటి క్యూట్ అమ్మాయిని ఎప్పుడూ చూడలేదు. సమయం చూసుకొని నిన్ను కలుస్తా. నాపై నీకున్న ప్రేమకు ఈ ముద్దులు పంపుతున్నా” అని పేర్కొంది. దీంతో గత రెండు రోజులుగా ఓ ఇష్యూ విషయమై వార్తల్లో నిలుస్తున్న పూజా మరోసారి ఇలా వార్తల్లోకెక్కింది.

Also Read:
ఈ ఏడాది ఆరంభంలోనే ‘అల.. వైకుంఠపురములో’ సినిమాతో భారీ హిట్ తన ఖాతాలో వేసుకున్న పూజా హెగ్డే.. ప్రస్తుతం ప్రభాస్‌తో కలిసి ‘రాధేశ్యామ్‌’ చిత్రంలో అలాగే అక్కినేని అఖిల్‌తో క‌లిసి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్’ సినిమాలో నటిస్తోంది.