పులికి హార్ట్ ఎటాక్ రాదు, నక్క షుగర్‌తో చావదు.. కానీ నువ్వు మాత్రం.. పూరీ షాకింగ్ కామెంట్స్

Share Icons:
ఇటీవల సినిమాల కంటే తన వ్యాఖ్యలతోనే విపరీతమైన పబ్లిసిటీ పొందుతున్నాడు సెన్సేషనల్ డైరెక్టర్ . ఇప్పుడేమో రోజుకి ఒక్కసారే ఆహారం తీసుకుందామంటూ ఓ ఆడియో ఫైల్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. రోజుకి ఒక్కసారే తినడం వల్ల రోగాలు రావని అంటున్నారు. జంతువులు ఒక్కసారి తినడం వల్లే వాటికి గుండెపోటు, షుగర్‌తో పాటు ఇతర వ్యాధులేమీ రావని, ఎక్కువ తినడం వల్లనే మనిషి రోగాల పాలవుతున్నాడని వ్యాఖ్యానించారు. మ్యూజింగ్స్‌లో ‘వన్‌ మీల్‌’ అనే టాపిక్‌ గురించి పూరీ సోమవారం వివరించారు.

Also Read:

”జంతువులు ఎప్పుడూ.. మరీ లావుగా అయిపోవడం కానీ, కొలెస్ట్రాల్ ఎక్కువై కొట్టుకోవడం కానీ ఉండవు. ఎప్పుడూ ఒకే వెయిట్‌తో ఉంటాయి. ఏ జబ్బులూ రావు వాటికి. ఎందుకంటే అడవిలో ఉన్న జంతువులన్నీ, రోజుకి ఒక్కసారే తింటాయ్‌. మనం ఎన్నిసార్లు తింటామో మనకే తెలియదు. డయాబెటిస్‌, హార్ట్ స్ట్రోక్, కొలెస్ట్రాల్‌, బ్లడ్ ప్రెషర్, పక్షవాతం, ఒబెసిటి.. ఇలా ఎన్నో జబ్బులు మనుషులకే వస్తాయ్‌. మనకున్న అన్ని జబ్బులకీ కారణం ఒకే ఒకటి. ఫుడ్‌ కన్‌జెన్షన్‌. ఈ శతాబ్ధంలోనే ఇది ఎక్కువైపోయింది. యానిమల్ ఒక్కసారే ఎందుకు తింటుందంటే.. దానికి మళ్లీ తిండి కావాలంటే లైఫ్‌ రిస్క్ చేసుకుని హంట్‌ చేసుకుని తినాలి. అందుకే అవి ఆకలి వేసినప్పుడే తింటాయ్‌.

Also Read:

కల్టివేషన్‌, కూలింగ్‌ ఫ్రిడ్జ్ మనల్ని తొక్కేస్తున్నాయ్‌. అన్నీ తినేసి మళ్లీ మిడ్‌ నైట్‌ లేచి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూడటం అలవాటైపోయింది మనకి. పదిసార్లు తినడం అలవాటు చేశాం. కాబట్టే ఆ టైమ్‌కి బాడీలో జ్యూస్‌లు రెడీ అయిపోయి దాన్ని ఆకలి అనుకుంటాం. అది ఆకలి కాదు అలవాటు. మనకి ఆకలికి, దాహానికి తేడా తెలియదు. అందుకే జంతువులు వెంటనే నీళ్లు తాగుతాయ్‌. నీళ్లు తాగినా సరే సేమ్ ఫీలింగ్‌ ఉంటే.. అది ఆకలి అని తెలుసుకుంటాయ్‌. ఆ మాత్రం కామన్‌సెన్స్ మనకి లేదు. మనం తిన్న వెంటనే 3 గంటల్లో జనరేట్‌ అయిన గ్లూకోజ్‌ని మన బాడీ వాడుకుంటది. ఎక్స్‌ట్రా గ్లూకోజ్‌ని లీవర్‌లో దాచుకుంటది. తర్వాత మెల్లగా వాడుకుందామని బాడీ ఉద్దేశం.

Also Read:

కానీ మన బాడీ లివర్‌లో ఉన్నదాన్ని తీసి వాడే లోపు మనం ఇంకో థమ్ బిర్యానీ తింటాం. దానిని ఎక్కడ స్టోర్ చేయాలో తెలియక, ఫ్యాట్‌ కింద మార్చేసి మన బాడీ మజిల్స్‌లో పెడతది. ఈ ఫ్యాట్‌ని తీసే ఛాన్స్ మనం ఎప్పుడూ బాడీకి ఇవ్వటం లేదు. జబ్బు చేస్తే మనకి ఏమీ తినబుద్ది కాదు. ఎందుకో తెలుసా? మన బాడీ అరుస్తుంటది. తినకు తినకు ప్లీజ్ అని. బుద్దిస్ట్‌లందరూ రోజుకి ఒక్కసారే తింటారు. రంజాన్ టైమ్‌లో ముస్లింలందరూ ఒక్కసారే తింటారు. హ్యాపీగా ఉంటారు. నువ్వు తినడం ఆపితే నీ బాడీ అన్ని సెట్‌ చేసుకుని నిన్ను పర్ఫెక్ట్ వెయిట్‌లో ఉంచి ఏ జబ్బులూ రాకుండా అదే చూసుకుంటది. నువ్వు చేయాల్సిందల్లా దయచేసి నీ కడుపుని డస్ట్ బిన్‌లా వాడొద్దు.

Also Read:

మంచి ఉదాహరణ చెబుతాను. ఈ కరోనా టైమ్‌లో ఇన్ని నెలలుగా కంట్రీలో ఎవడికైనా కరోనా తప్ప.. మరో జబ్బు వచ్చిందా? కనీసం జలుబు, జ్వరాలు కూడా లేవు. ఎందుకంటే చిరాకు వచ్చి తక్కువ తింటున్నామ్‌. ఇంటి పట్టునే ఉండి ఇంటి ఫుడ్‌ తింటున్నాం. ఇంతకు ముందు హాస్పిటల్స్ ఖాళీ ఉండేవి కావు. బ్లడ్ టెస్ట్‌లు చేయించుకోవాలంటేనే పెద్ద క్యూ ఉండేది. ఇవన్నీ మాయమైపోయావా లేదా? చాలా రోగాలు రోడ్డు మీద ఫుడ్‌ వల్లే. లాక్‌డౌన్‌లో కొంచెం తక్కువ తింటేనే మనకి ఇంత ఆరోగ్యం వస్తే.. రోజూ ఒక్క పూటే తింటే?. అయితే సడెన్‌గా వన్‌ మీల్‌కి వస్తే.. ఎసిడిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే రోజూ రెండు సార్లు తినండి. నేను 30 సంవత్సరాలుగా రోజుకి రెండు సార్లు మాత్రమే తింటున్నాను. బ్రేక్ ఫాస్ట్ తినను. ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు నాకు. స్టమక్ అప్సెట్‌లు కూడా లేవు. ప్రతి సంవత్సరం నా రిపోర్ట్స్ నార్మల్‌గా ఉంటాయ్‌.


నా ఫ్రెండ్‌ డాక్టర్‌. తను కూడా యానిమల్‌లా రోజుకు ఒక్కసారే తింటాడు. సిక్స్ ప్యాక్‌తో ఫిట్‌గా ఉన్నాడు. బట్ రోజంతా వన్ మీల్‌ మీద ఉండటం చాలా కష్టం. కనీసం టు మీల్‌ ఫర్ డే కి వచ్చేయండి. టు మీల్‌ కలిపితే వన్ మీల్‌ క్వాంటిటీ అయి ఉండాలి. ఇది చేసే ముందు ఒక్కసారి మీ డాక్టర్‌ని అడగండి. బట్‌ ఎంత తక్కువ తింటే అంత మంచిది. గుండె పోటు వచ్చి పులి చావదు. షుగర్‌ వచ్చి నక్క చావదు. కానీ నువ్వే పోతావ్‌..” అని వన్‌ మీల్‌ ప్రాధాన్యతను ఈ ఆడియోలో పూరీ జగన్నాథ్ తెలిపారు.

Also Read: