#పీకే లవ్స్.. ఓపెన్ అయిన పూనమ్ కౌర్, ఎవరా అహంకారి?

Share Icons:
పూనమ్ కౌర్.. ఎవరి మీద ట్వీట్ చేస్తుందో.. ఎందుకు చేస్తుందో.. తెలియదు కాని.. ఆమె ట్వీట్ చేసిన ప్రతిసారి వైరల్ అవుతూనే ఉంటుంది. గతానుభవాలనుండి బయటకు రాలేక.. వేదన, వైరాగ్యంతో కూడిన ఆమె ట్వీట్లు మాత్రం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించే అనేవారు చాలామందే ఉన్నారు. గతంలో ఆమె జనసేన అధినేత , దర్శకుడు త్రివిక్రమ్‌లపై ఇన్ డైరెక్ట్‌ ట్వీట్లు చేసి పవన్ అభిమానుల ఆగ్రహానికి గురైంది. ‘ఓ అబద్ధాలకోరు రాజకీయ నాయకుడు కాగలడు కాని లీడర్ కాలేడు’ లాంటివి చేసిన ట్వీట్లతో మచ్చుతునకలు మాత్రమే. అయితే అప్పట్లో ఎవర్ని ఉద్దేశించి ట్వీట్లు చేసిందన్నది పక్కనపెట్టేస్తే.. నేడు మాత్రం ‘పీకే లవ్స్’ హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేయడంతో ఇది మాత్రం పవన్‌ను ఉద్దేశించే అని ఫిక్స్ అయిపోవచ్చు.

నేడు జనసేన ఆవిర్భావ వేడుకల్లో జనసైనికులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈ సందర్భం #పీకే లవ్స్ హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ వదిలింది పూనమ్ కౌర్. ‘డబ్బు హోదా ఉన్నవాడు రాజు అవ్వొచ్చు కాని.. ప్రేమ త్యాగం న్యాయం కోసం పోరాడే వ్యక్తి వీరుడవుతాడు. రాజుని శాసిస్తాడు. వీరులు మిమ్ములను కాపాడుతారు.. శాసించాలి అని తపన పడే మనిషిలో అహంకారం ఉంటుంది. అందరూ బాగుండాలనుకునే వ్యక్తులతో ప్రేమ వైరాగ్యం ఉంటుంది’ అంటూ పీకే లవ్స్, జై హింద్ హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేసింది పూనమ్ కౌర్. అయితే ఆ డబ్బు ఉన్న వ్యక్తి ఎవరు? పోరాడే వ్యక్తి ఎవరు? రాజుని శాసించే వీరుడు ఎవరు? ఆ అహంకారి ఎవరు? అందరూ బాగుండాలి అని కోరుకునే వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తిలోని ప్రేమ, వైరాగ్యం ఏంటి? అన్న విషయాలను నెటిజన్ల ఆలోచనలకే వదిలేసింది పూనమ్.