పార్టీల్లో అగ్ర హీరోలకు అదే పని.. ప్రైవేట్ పార్ట్స్ తాకిస్తూ రెచ్చిపోతారు.. కంగనా రనౌత్ ఓపెన్ కామెంట్స్

Share Icons:
సుశాంత్ సింగ్ మరణం తర్వాత బాలీవుడ్‌లో బయటపడుతున్న బాగోతాలు విని షాక్ అవుతున్నారు ప్రేక్షకులు. ఒక్కొక్కటిగా బీ టౌన్ వర్గాలను వణికించే రహస్యాలు రివీల్ అవుతున్నాయి. నెపోటిజం, డ్రగ్స్, కాస్టింగ్ కౌచ్ ఇలా బడా బాబులను షేక్ చేసే వరుస ఇష్యూస్ బయటకొస్తున్నాయి. ఓ వైపు కంగనా లాంటి ఫైర్ బ్రాండ్స్ బీ టౌన్ వర్గాలకు చుక్కలు చూపిస్తుంటే.. తాజాగా హీరోయిన్ తనపై డైరెక్టర్ లైంగిక దాడి చేశాడంటూ సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఇష్యూలో ఎంటరై తనదైన శైలిలో షాకింగ్ కామెంట్స్ చేసింది .

Also Read:
అసలే గత కొన్ని రోజులుగా కంగనా- అనురాగ్ మధ్య మాటల యుద్దం నడుస్తోంది. ఇంతలో పాయల్ ఘోష్ లైంగిక ఆరోపణలు చేయడంతో ఆయనపై మండిపడింది కంగనా. పాయల్‌ ఘోష్‌ ఎలాంటి పరిస్థితినైతే ఎదుర్కొందో తాను కూడా అలాంటి పరిస్థితిని అగ్రహీరోలతో ఎదుర్కొన్నానని చెబుతూ ఓపెన్ అయింది. పార్టీల్లో ఫ్రెండ్లీగా డాన్స్‌ చేసే సమయంలో వారి జనేంద్రియాలు పనిచేయడం ప్రారంభిస్తాయని, మహిళలను ఎక్కడెక్కడో తాకుతూ రెచ్చిపోతుంటారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది ఫైర్ బ్రాండ్ కంగనా.

తనకు తెలిసినంత వరకు పాయల్ ఎదుర్కొన్న అనుభవాలు బాలీవుడ్‌లో సాధారణమే అని కంగనా చెప్పింది. ఇండస్ట్రీలోని అవుట్‌ సైడర్స్‌ అయిన అమ్మాయిలను సెక్స్‌ వర్కర్స్‌గా భావిస్తూ లైంగిక దాడి చేస్తుంటారని ఆమె తెలిపింది. కంగనా చేసిన ఈ వ్యాఖ్యలతో పాయల్ ఘోష్- అనురాగ్ కశ్యప్ ఇష్యూ మరింత హాట్ టాపిక్ అయింది. మరోవైపు తనపై పాయల్ చేసిన ఆరోపణలను ఖండిస్తూ ఆమె తీరును తప్పుబట్టారు అనురాగ్ కశ్యప్.