పాక్ ఆల్‌రౌండర్ రిటైర్మెంట్.. అదే ఆఖరి

Share Icons:
పాకిస్థాన్ సీనియర్ ఆల్‌రౌండర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఈ ఏడాది అక్టోబరులో టీ20 వరల్డ్‌కప్ జరగనుండగా.. ఆ టోర్నీ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు చెప్పబోతున్నట్లు హఫీస్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. పాక్ తరఫున హఫీజ్ 55 టెస్టులు, 218 వన్డేలు, 91 టీ20 మ్యాచ్‌లను ఆడి.. మొత్తంగా 12,258 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్‌లోనూ రాణించిన ఈ 39 ఏళ్ల క్రికెటర్.. 246 వికెట్లు పడగొట్టాడు.

Read More:

ఇటీవల పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో 10 మ్యాచ్‌లాడిన మహ్మద్ హఫీజ్ 217 పరుగులు చేశాడు. ఇందులో 98 పరుగుల రూపంలో శతక సమాన ఇన్నింగ్స్‌ కూడా ఒకటి ఉంది. దీంతో.. అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించినా.. పీఎస్‌ఎల్ లాంటి ప్రైవేట్ టీ20 లీగ్స్‌లో మాత్రం కొనసాగుతానని హఫీజ్ స్పష్టం చేశాడు.

Read More:

‘‘టీ20 వరల్డ్‌కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకున్నాను. అయితే.. టీ20 లీగ్స్‌లో మాత్రం ఆడతా. భవిష్యత్ ఎలా ఉంటుందో..? నాకు తెలియదు. కానీ.. కోచ్‌గా అవకాశం వస్తే మాత్రం వదులుకోను’’ అని హఫీజ్ వెల్లడించాడు. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత పాక్ జట్టుకి కొన్ని నెలలు దూరమైన హఫీజ్ ఈ ఏడాది ఆరంభంలో మళ్లీ పునరాగమనం చేశాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో మెరుపు హాఫ్ సెంచరీతో పాక్‌ని గెలిపించిన ఈ సీనియర్ బ్యాట్స్‌మెన్.. ఆ తర్వాత కూడా నిలకడగా రాణిస్తున్నాడు.