పవన్@27.. ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేలా కొత్త టైటిల్?

Share Icons:
ఓ వైపు రాజకీయాలు, మరోవైపు వరుస సినిమాలతో పవర్‌స్టార్ బిజీ అయిపోయారు. ప్రస్తుతం ‘వకీల్ సాబ్’గా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమైన ఆయన డైరెక్టర్ క్రిష్‌తో తెరకెక్కే భారీ సినిమా ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. పవన్‌ బర్త్‌డే రోజున దీనికి సంబంధించి ప్రకటన వెలువడింది. మొగల్ పరిపాలనా కాలానికి చెందిన ఈ కథలో పవన్ గజదొంగగా నటించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. దీంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read:

మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాకి `విరూపాక్ష`, `గజదొంగ` అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు గతంలో వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే మరో టైటిల్ తెరమీదకు వచ్చింది. ఈ సినిమాకు ‘ఓం శివమ్’ అనే పేరు పెట్టబోతున్నట్ల గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్ కెరీర్‌లో 27వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై పవన్‌ ఫ్యాన్స్‌తో పాటు టాలీవుడ్ మొత్తం ఎంతో ఆసక్తిగా కనబరుస్తోంది.

Also Read: