పవన్.. పుతిన్ సాయం కోసం రష్యన్ యువతిని పెళ్లాడడా? వామ్మో ఇదేం వాదన సామీ!

Share Icons:
అప్పట్లో వీరాభిమానిగా.. జనసైనికుడుగా తన వాదనను బలంగా వినిపించిన కళ్యాణ్ పార్టీలో జరిగిన రాజకీయ పరిణామాలతో పార్టీకి దూరం అయ్యారు. అయితే ఇప్పుడు న్యాయవాదిగా టీవీ చర్చల్లో తన వాదనలు వినిపిస్తూ పవన్‌పై ఉన్న అభిమానాన్ని చూపిస్తున్నారు దిలీప్ సుంకర.

అయితే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై వస్తున్న విమర్శల్ని గట్టిగా తిప్పికొట్టిన దిలీప్ సుంకర.. పవన్ కళ్యాణ్ రష్యన్ యువతిని చేసుకోవడంపై వస్తున్న రూమర్లకు చెక్ పెడుతూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ‘విమర్శలు వినడానికి బాగానే ఉంటాయి.. బేస్ లెస్ విమర్శలు వినడానికి ఇంకా బాగుంటాయి తప్పితే వాటిలో అర్థం ఉండదు. పవన్ కళ్యాణ్ గారు రష్యన్ అమ్మాయిని ఎందుకు చేసుకున్నారు అంటే.. రేపటి రోజున డబ్బులు లేకపోతే రష్యా అధ్యక్షుడు పుతిన్ సాయం చేస్తారు కాబట్టి.. పుతిన్ గారు డబ్బులు ఇస్తారంట అంటే.. కథ కూడా బాగుంటుంది.

అరవింద సమేతలో ఎన్టీఆర్ ఓ డైలాగ్ చెప్తాడు.. చెప్పేవాడు సరిగా చెప్పాలి కాని.. ఒక్కో సందర్భంలో చెప్పేదాన్ని బట్టి దాని విలువే మారిపోద్ది’ అని. పవన్ రష్యా వెళ్లాడు.. పుతిన్ సాయం కోసమేనా అంటే వాళ్లకి ఏం చెప్తాం.. కొన్ని ఆరోపణలకు బేస్ ఉండదు.. అవి వినడానికి బావుంటాయి అంతే’ అంటూ ఆసక్తికరకామెంట్స్ చేశారు దిలీప్ సుంకర. అయితే ఈ వీడియో పాతదే అయినప్పటికీ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.