పల్లెటూరి బొమ్మలా రాశీ ఖన్నా.. అచ్చతెలుగందం ఎంత సక్కగుందో!

Share Icons:
సుమారు 6 నెలల లాక్‌డౌన్ పీరియడ్‌లో క్వారంటైన్ లైఫ్‌ను ఎంజాయ్ చేసిన హీరోయిన్ రాశీ ఖన్నా.. ప్రస్తుతం వరుస ఫొటోషూట్స్‌తో పిచ్చెక్కిస్తోంది. క్వారంటైన్ తరవాత ఆమె చేసిన ఫస్ట్ ఫొటోషూట్ తెలుగు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే, ఎప్పుడూలేనంత హాట్‌గా ఈ ఫొటోషూట్‌లో కనిపించింది. పైబటన్ తీసేసిన వులెన్ షర్ట్ ధరించి కింద ఇంకేమీ వేసుకోకుండా అందాలను ఆరబోసింది. ఆ తరవాత కూడా చేప పొలుసు లాంటి డ్రెస్‌లో సాగర కన్యలా ఫొటోషూట్ చేసింది. ఆ రెండు ఫొటోషూట్లలోనూ వెస్టరన్ స్టైల్లో కనిపించిన ఈ ఢిల్లీ బ్యూటీ.. తాజా ఫొటోషూట్‌లో మాత్రం అచ్చతెలుగు అమ్మాయిలా కనిపించింది.

ఎరుపు, ఆకుపచ్చ రంగు ఓణీలో పల్లెటూరి బొమ్మలా రాశీ ఖన్నా మెరిసిపోతోంది. చాలా తక్కువ మేకప్, సింపుల్ కాస్ట్యూమ్స్‌, చెవులకు జూకాలు, చేతులకు మట్టి గాజులతో అచ్చతెలుగందంతో కట్టిపడేసింది. ఈ అందమైన ఫొటోలను తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా రాశీ ఖన్నా అభిమానులతో పంచుకుంది. ఈ కాస్ట్యూమ్‌ను డిజైన్ చేసిన శ్రావణ్ కుమార్‌కు ఆమె థ్యాంక్స్ చెప్పింది. ఈ లుక్ తనకు ఎంతగానో నచ్చిందని వెల్లడించింది.

ఇదిలా ఉంటే, అన్‌లాక్ 4 అమలులోకి వచ్చిన తరవాత రాశీ ఖన్నా తరచుగా జిమ్‌కు వెళ్లింది. వర్కౌట్స్ చేస్తూ కనిపించింది. గత కొన్ని వారాలుగా హైదరాబాద్‌లోని జిమ్ వద్ద ఆమె కెమెరా కంటికి చిక్కుతుంది. కాగా, తన క్వారంటైన్ పీరియడ్‌లో రాశీ ఖన్నా గిటార్ వాయించడం నేర్చుకుంది. అలాగే, తమిళం మాట్లాడటం కూడా నేర్చుకుంది. అలాగే, ఇంటి వద్ద బోలెడన్ని యోగా ఆసనాలను ప్రాక్టీస్ చేసింది. మొత్తానికి ఈ క్వారంటైన్ పీరియడ్‌ను తనకు అనుకూలంగా చక్కగా ఉపయోగించుకుంది.

ఇక సినిమాల విషయానికి వస్తే.. తొలి చిత్రం ‘ఊహలు గుసగుసలాడే’లో సాయి శిరీష ప్రభావతి పాత్ర నుంచి ‘ప్రతిరోజూ పండగే’లో టిక్‌టాక్ స్టార్ ఏంజెల్ ఆర్నా పాత్ర వరకు రాశీ ఖన్నా ప్రేక్షకులను కట్టిపడేసింది. ప్రతి పాత్రలోనూ కాస్త హాస్యాన్ని జోడించి తెలుగు ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది. అందం, అభినయం ఈ రెండూ కలిగిన సక్సెస్‌ఫుల్ యాక్ట్రెస్‌గా టాలీవుడ్‌లో రాణిస్తోంది. ‘వరల్డ్ ఫేమస్ లవర్’లో విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేసిన రాశీ.. ప్రస్తుతం కోలీవుడ్‌లో వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది.