పర్యావరణ హితానికి రామ్‌కీ ఎన్విరో చొరవ.. పలు ప్రోగ్రాంలతో ముందుకు..

Share Icons:
దేశంతో పాటుగా ఆసియాలో సమగ్రమైన పర్యావరణ నిర్వహణ సేవలను అందించడంలో సుప్రసిద్ధమైన (రీల్) ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు సిటిజన్‌షిప్ కార్యక్రమాలను నిర్వహించింది. పర్యావరణ పరిరక్షణ పట్ల తగిన చర్యలను తీసుకోవడంతో పాటు దాని చుట్టూ అవగాహన మెరుగుపరచడమే లక్ష్యంగా రీల్ ఉద్యోగులు భారతదేశంలోని 25కు పైగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో పలు కార్యక్రమాలను నిర్వహించారు.

* రీల్ ఉద్యోగులు 2 లక్షలకు పైగా మొక్కలను పలు ప్రాంతాల్లో నాటడం ద్వారా పర్యావరణ పునరుద్ధరణకు తోడ్పాటునందించారు.
* రీల్ బృందం 100కు పైగా గ్రామాలలో పరిశుభ్రత, స్వచ్ఛత కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా వ్యర్థ రహితంగా వాటిని మార్చడంలో తోడ్పడటంతో పాటు కాలుష్యం తగ్గించేందుకు తగిన ప్రణాళికను సైతం అమలుచేశారు.
* ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 15 వేల మంది ఉద్యోగులు రీల్ స్పాన్సర్ చేసిన వెబినార్లో పాల్గొనడంతో పాటుగా వ్యక్తిగత శుభ్రత, స్వచ్ఛత మరియు భౌతిక దూరం ఆవశ్యకత పట్ల అవగాహన మెరుగుపరుచుకుని కోవిడ్-19తో పోరాడుతున్నారు.
* రెండు వేల టన్నుల కంపోస్టును రీల్ సైట్ల వద్ద ఉత్పత్తి చేసి దానిని పూర్తి ఉచితంగా స్థానిక రైతులు, చుట్టు పక్కల ప్రాంతాల రైతులకు సరఫరా చేశారు.

రీల్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘పర్యావరణ క్షీణత అనేది ఇప్పుడు అతి పెద్ద ఆందోళనగా నిలుస్తోంది. పర్యావరణ పరిరక్షణ అనేది మానవులుగా మనందరి బాధ్యత. పర్యావరణ సమస్యకు ఎన్నో కారణాలున్నాయి. అందులో వ్యర్థాలను సరిగా నిర్వహించకపోవడం కూడా ఒకటి. గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాలు పెరుగుతుండటం వంటివి ఇతర కారణాలు. పర్యావరణాన్ని నిర్వహించడంతో పాటుగా అందుబాటులోని అత్యుత్తమ పర్యావరణ సాంకేతికతలను స్వీకరించడం ద్వారా పర్యావరణాన్ని నిర్వహించడంతో పాటుగా పర్యావరణవాదాన్ని ప్రోత్సహించడంతో పాటుగా దాని పట్ల అవగాహన మెరుగుపరచడం ఇప్పుడు అత్యంత ఆవశ్యకం. ఈ లక్ష్యంతోనే, రీల్ బృందం ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా కమ్యూనిటీలకు మద్దతునందిస్తుంది. సస్టెయినబిలిటీ కార్యక్రమాల ద్వారా స్వచ్ఛమైన, సురక్షితమైన వాతావరణానికి మద్దతు ఇస్తుంది’’ అని అన్నారు.