నేను హీరోయిన్‌కి ప్రపోజ్ చేయడమేంట్రా: మహేష్ విలన్ ఆగ్రహం

Share Icons:
‘ఖుషి’ డైరెక్టర్.. ‘స్పైడర్’ విలన్ ఎస్.‌జే సూర్య.. ప్రముఖ తమిళ నటి ప్రియా భవానీ శంకర్‌కు ప్రపోజ్ చేశారట. కొంతకాలంగా ఈ విషయం బాగా ప్రచారం అయింది. గతంలో వీరిద్దరూ జంటగా ‘మాన్‌స్టర్’ అనే సినిమాలో నటించారు. ఇప్పుడు ‘బొమ్మాయ్’ అనే తమిళ సినిమాలో మరోసారి కలిసి నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రియపై సూర్యకు ప్రేమ పుట్టిందని, సెట్స్‌లోనే ఆమెకు ప్రపోజ్ చేశాడని కొంతకాలంగా వార్తలు వెలువడుతున్నాయి.

ఈ పుకార్లు మితిమీరేలోపు స్పందించి అందరికీ ఒకేసారి సమాధానం ఇవ్వాలని అనుకున్నారు సూర్య. తన గురించి ఇలాంటి దిక్కుమాలిన వార్తలు రాస్తున్న వ్యక్తిని తిడుతూ ఓ ట్వీట్ పెట్టారు. ‘‘నేను ప్రియాంక భవానీ శంకర్‌కు ప్రపోజ్ చేశానని, కానీ ఆమె రిజెక్ట్ చేశారని కొందరు ఇడియట్స్ తప్పుడు వార్తలు క్రియేట్ చేస్తున్నారు. మేమిద్దరం ‘మాన్‌స్టర్’ సినిమా చేస్తున్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్. అంతకుమించి ఆమె సిన్సియర్ నటి. ఇలాంటి చెత్త పుకార్లు పుట్టించి చిరాకు తెప్పించకండి’ అని ఘాటుగా స్పందించారు.

See Photo Story:

‘బొమ్మాయ్’ సినిమాకు రాధా మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. వ్యాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఖుషి’ సినిమాకు సూర్య డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దద్దరిల్లిపోయింది. పవన్ కెరీర్‌లోనే ఓ ల్యాండ్ మార్క్‌గా నిలిచిపోయింది. ఆ తర్వాత సూపర్‌‌స్టార్ మహేష్ బాబు నటించిన ‘స్పైడర్’ సినిమాలో సూర్య విలన్ పాత్రలో నటించారు. కానీ ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది.

READ ALSO: