నెట్‌ఫ్లీక్స్‌లో జాన్వి కపూర్ సినిమా… రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

Share Icons:
సినిమా ప్రముఖులంతా ఇప్పుడు ఓటీటీలపై దృష్టి పెడుతున్నారు. కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్‌తో సినిమా షూటింగులు నిలిచిపోయాయి. కొత్త సినిమాల విడుదల ఆగిపోయింది. థియేటర్లు కూడా బంద్ కావడంతో ఓటీటీలో సినిమాలను విడుదల చేసేందుకు నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే అనేక తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్, శ్రీదేవి కూతరు నటించిన సినిమా కూడా ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది.

జాన్వీ కపూర్‌ నటించిన ‘గుంజన్‌ సక్సేనా: ద కార్గిల్‌ గాళ్‌’ ఆగస్టు 12న నెట్‌ ఫ్లిక్స్‌ వేదికగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ విషయాన్ని జాన్వీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వేదికగా తెలిపింది. ‘ఫస్ట్‌ ఇండియన్‌ ఫీమేల్‌ ఎయిర్‌ఫోర్స్‌ పైలెట్‌ గుంజన్‌ సక్సేనా జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకురావటం చాలా గర్వంగా ఉంది. ఆమె జీవితం నాకు చాలా స్ఫూర్తిని ఇచ్చింది. మీకు కూడా స్ఫూర్తిని కలిగిస్తుందని ఆశిస్తూన్నా. ‘గుంజన్‌ సక్సేనా: ద కార్గిల్‌ గాళ్‌’ ఆగస్టు 12న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అవుతుంది’ అని జాన్ని తన పోస్టులో పేర్కొంది.

Read More:

ఈ సినిమాకు సంబంధించిన మూడు మోషన్‌ పోస్టర్లను జాన్వీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఈ చిత్రం విడుదల తేదీ ఖరారుకు ముందు రోజు జాన్వీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ‘గుంజన్‌ సక్సేనా: ద కార్గిల్‌ గాళ్‌’ మూవీకి సంబంధించి ప్రత్యేకమైన ప్రయాణాన్ని మీ అందరితో పంచుకోవడానికి వేచి ఉండలేకపోతున్నా. ‌నా సస్పెన్స్‌కు నెట్‌ ఫ్లిక్స్ తొందరంగా ముగింపు ఇవ్వాలి’ అని కామెంట్‌ జతచేశారు. శరణ్‌ శర్మ ఈ చిత్రాన్ని డైరెక్ట్‌ చేశారు. వాస్తవానికి ఈ చిత్రాన్ని ఈ ఏడాది మార్చి 13న విడుదల చేయాలనుకున్నారు. ఆ తర్వాత ఏప్రిల్‌ 24కు వాయిదా వేశారు. కరోనా వైరస్‌ కారణంగా థియేటర్లు మూతపడటంతో విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు వచ్చేనెల 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.