నువ్వు బాకీ ఉన్నావ్.. నీ వ్యాపార భాగస్వామ్యం అంటూ బాలీవుడ్ నిర్మాతపై ఛార్మి కామెంట్

Share Icons:
బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్‌పై ఒకప్పటి హీరోయిన్, నేటి నిర్మాత కౌర్ కామెంట్ చేసింది. నేడు (మే 25) కరణ్ జోహార్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయనతో దిగిన పిక్ షేర్ చేస్తూ ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పింది. ”హాపీయెస్ట్ బర్త్ డే.. మీతో వ్యాపార సహకారం చాలా సరదాగా ఉంది. మీరు పక్కనుంటే ఎప్పుడూ సరదాగా అనిపిస్తుంటుంది. డల్ మూమెంట్ అనేది దరిచేరదు. నువ్వు పార్టీ బాకీ ఉన్నావ్” అంటూ ట్యాగ్ చేసింది ఛార్మి.

ఛార్మి చేసిన ఈ ట్వీట్ చూసి టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులు కరణ్ జోహార్‌కి పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం ఛార్మి, సంయుక్తంగా ‘ఫైటర్’ సినిమా రూపొందిస్తున్నారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తుండగా, ఆయన సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ముంబై నేపథ్యంలో సాగే ఆసక్తికర కథాంశంతో యూత్ ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా ఈ మూవీ రూపొందుతోంది.

Also Read:
‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్స్‌పై ధర్మా ప్రొడక్షన్స్ సమర్పిస్తున్న ఈ చిత్ర నిర్మాణంలో కరణ్ జోహార్, అపూర్వ మెహతా, ఛార్మి నిర్మాణ భాగస్వాములుగా ఉన్నారు. ప్యాన్ ఇండియా సినిమాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.