నిహారిక సెల్‌ఫోన్‌ సీక్రెట్స్.. కాబోయే భర్తతో రొమాంటిక్‌గా!! స్వయంగా రివీల్ చేసిన మెగా డాటర్

Share Icons:
కూతురు, టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అతిత్వరలో పెళ్లిపీటలెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే తన పెళ్లి విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ కాబోయే భర్త ఫోటోలు షేర్ చేసి మెగా అభిమానుల్లో ఉత్సాహం నింపింది నిహారిక. మరికొద్ది రోజుల్లోనే పెళ్లి సందడి షురూ కానుందని పేర్కొంది. అప్పటి నుంచి నిహారిక పెళ్ళికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అభిమానులతో చిట్ చాట్ చేసిన నిహారిక.. మరోసారి తనకు కాబోయే భర్త గురించి ప్రస్తావిస్తూ కొన్ని సీక్రెట్స్ రివీల్ చేయడం హాట్ టాపిక్ అయింది.

ఓ వైపు సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూనే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నిహారిక తాజాగా అభిమానులతో కాసేపు ముచ్చటించింది. నెటిజన్లు అడిగిన పలు సరదా ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే తన సినిమా సంగతులు, పర్సనల్ విషయాలపై నెటిజన్స్ అడిగిన అన్ని ప్రశ్నలకు రియాక్ట్ అవుతూ ఓపెన్ అయింది.

Also Read:
మీ ముఖంపై పింపుల్ కనిపిస్తోందని ఓ నెటిజన్ చేసిన కామెంట్‌పై రియాక్ట్ అయిన నిహారిక.. కంగ్రాట్స్.. నీ కోసం అవార్డు మీ ఇంటికే పంపిస్తానని రిప్లై ఇచ్చింది. ఆ తర్వాత మరో నెటిజన్ ”మీ సెల్‌ఫోన్ వాల్ పేపర్ ఏంటి?” మరోకరు ప్రశ్నించగా.. కాబోయే భర్త చైతన్యతో దిగిన ఫొటోను వాల్ పేపర్‌గా పెట్టుకున్నానని తెలిపింది. అంతేకాదు ఆ రొమాంటిక్‌ వాల్ పేపర్‌ని షేర్ చేస్తూ అందరికీ చూపించింది. దీంతో ఆమె ఫోన్‌లో ఉన్న కొన్నియాప్స్ కూడా అందరి కంట పడ్డాయి. ఆ యాప్స్ ప్రకారంగా చూస్తే ఆమెకు సెల్‌ఫోన్‌‌ గేమ్స్ అంటే ఇష్టమని అర్థమవుతోంది.

గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కొడుకు జొన్నలగడ్డ వెంకట చైతన్యను నిహారిక పెళ్లి చేసుకోనుంది. ఇండియన్ స్కూల్ బిజినెస్‌లో ఎంబీఏ పూర్తిచేసిన చైతన్య.. హైదరాబాద్‌లోని ఓ ఎంఎన్‌సీ కంపెనీలో ఉన్నత పదవిలో ఉన్నట్టు సమాచారం. ఆగస్టులో వీరి నిశ్చితార్థం, వచ్చే ఏడాది పెళ్లి ఉండోబోతోందని తెలుస్తోంది.