నిహారిక డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్స్.. పెళ్లి పనులు షురూ.. మెగాడాటర్ మ్యారేజ్ ఎప్పుడో చెప్పేసిన నాగబాబు

Share Icons:
మెగాడాటర్ నిహారిక పెళ్లి పనులు షురూ అయ్యాయట. పెళ్లి ఏర్పాట్లతో వరుణ్ తేజ్ బిజీ అయిపోయారట. ఈ విషయాన్ని నిహారిక తండ్రి కన్ఫర్మ్ చేశారు. డిసెంబర్ నెలలో తన కూతురు మ్యారేజ్ పెట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన నాగబాబు.. నిహారిక మ్యారేజ్ విషయమై రియాక్ట్ అవుతూ ఓపెన్ అయ్యారు. నిహారిక పెళ్లి సంబరాలు తమ కుటుంబంలో ఆనందం నింపాయని, డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం కొన్ని ప్రాంతాలను పరిశీలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఇటీవలే నిహారిక తన పెళ్లి వార్తను కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. తనకు కాబోయే వాడి ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. తనను పెళ్లాడే వాడి పేరు చైతన్య అని తెలుపుతూ తమ ప్రైవేట్ పిక్స్ షేర్ చేసి మెగా శిబిరాల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆ తర్వాత ఆగస్టు నెలలో నిహారిక- చైతన్య నిశ్చితార్ధ వేడుకను కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు నాగబాబు. ఈ నిశ్చితార్ధ వేడుకకు సంబంధించిన పిక్స్ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.

Also Read:
నిహారిక- చైతన్య జోడీ చూడముచ్చటగా ఉందంటూ మురిసిపోయిన మెగా ఫ్యాన్స్.. పెళ్లి ఎప్పుడు పెట్టుకుంటారు? నిహారికను పెళ్లి పీటలపై ఎప్పుడెప్పుడు చూడాలా? అనే కుతూహలంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నాగబాబు ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో అంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు. డిసెంబర్‌లో పెళ్లి ఉంటుందని ప్రకటించిన మెగా బ్రదర్ పెళ్లి తేదీని అతిత్వరలో వెల్లడిస్తామని అన్నారు.

గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కొడుకు జొన్నలగడ్డ వెంకట చైతన్యను నిహారిక పెళ్లి చేసుకోనుంది. ఇండియన్ స్కూల్ బిజినెస్‌లో ఎంబీఏ పూర్తిచేసిన చైతన్య.. హైదరాబాద్‌లోని ఓ ఎంఎన్‌సీ కంపెనీలో ఉన్నత ఉద్యోగం చేస్తున్నారు. వీరి పెళ్లిని గ్రాండ్‌గా నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది మెగా ఫ్యామిలీ.