నితిన్ పెళ్లి వాయిదా..! ఫ్యామిలీ స్పందన

Share Icons:
ఒకవైపు కరోనా వైరస్ ప్రభావంతో సినిమా ఇండస్ట్రీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. షూటింగ్‌కి బ్రేక్ ఇవ్వడంతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. ఇక థియేటర్స్ కూడా మూసేయడడంతో కోట్లు ఖర్చు పెట్టి విడుదల చేసిన సినిమా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇదిలా ఉంటే కరోనా ఎఫెక్ట్‌ యువ హీరోల పెళ్లికి అడ్డంకిగా మారింది. నిఖిల్ పెళ్లి వచ్చే 16 జరగాల్సి ఉండగా.. తాను మాత్రం పెళ్లిని వాయిదా చేసుకునేది లేదని.. అవసమైతే గుళ్లోకి వెళ్లైనా పెళ్లి చేసేసుకుంటా అని క్లారిటీ ఇచ్చారు. అయితే మరో హీరో పెళ్లికి మాత్రం కరోనా అడ్డంకులు వీడటం లేదు. ఎందుకంటే డెస్టినేషన్ పెళ్లి దుబాయ్‌లో జరిపించమే ప్రధాన సమస్యగా మారింది.

హీరో నితిన్ తన స్నేహితురాలు షాలినితో ఇటీవల ఎంగేజ్ మెంట్ చేసుకుని ఏప్రిల్ 15న పెళ్లి, 16 రిసెప్షన్ చేసుకునేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఈ పెళ్లి వేడుకను అంగరంగవైభవంగా జరుపుకునేందుకు దుబాయ్‌లోని వెర్సేస్ పాలాజ్జో లగ్జరీ హోటల్‌ను ముందే బుక్ చేసుకున్నారు. ఈ డెస్టినేషన్ మ్యారేజ్‌కు 100 మంది గెస్ట్‌లను ఆహ్వానించనున్నారు. అయితే కరోనా ఎఫెక్ట్‌తో దుబాయ్‌తో అన్ని దేశాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఇతర దేశాల నుంచి వచ్చే వారికి పరీక్షలు నిర్వహిస్తోంది.

అయితే దుబాయ్‌లోనే కావడంతో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పెళ్లిని వాయిదా వేయాలా? లేక వేదికను మార్చుకోవాలన్న గందరగోళంలో పెళ్లి వాయిదా వేస్తేనే మంచిదనే అభిప్రాయానికి వచ్చారను నితిన్ ఫ్యామిలీ సభ్యులు. నితిన్ పెళ్లి వాయిదా విషయంపై ఆయన తండ్రి, నిర్మాత సుధాకర్ రెడ్డి స్పందిస్తూ.. ‘నితిన్ పెళ్లి వేదికను మార్చే ఆలోచనలో ఉన్నాం.. కరోనా వైరస్ ప్రభావంతో దుబాయ్ నిర్వహించడం కష్టంగా మారిని పరిస్థితి. అక్కడే చేయాలా? లేక వేరే చోటికి మార్చాలా? లేదంటే వాయిదా వేసుకోవాలా? అన్నదానిపై ఆలోచన చేస్తున్నాం. పెళ్లికి వచ్చే గెస్ట్‌లకు ఇబ్బందులు కలగకుండా బెటర్ ఆప్షన్ కోసం ఎదురుచూస్తున్నాం. అయితే పెళ్లికి ఇంకా సమయం ఉండటంతో సానుకూలత ఏర్పడుతుందని.. అన్నీ అనుకున్నట్టుగానే జరుగుతాయని ఆశిస్తున్నాం’ అని తెలిపారు. చూడాలి మరి నిఖిల్ మాదిరి మా పెళ్లి ఎలా జరిగినా పెర్లేదు.. పెళ్లి మాత్రం జరగాలి అనుకుంటాడో.. లేదంటే మా పెళ్లి ఇలాగే జరగాలని నితిన్ ఫిక్స్ వాయిదా వేసుకుంటారో.

Read Also: