నితిన్ పెళ్లి తేదీ ఖరారు… ఈనెల 26న వివాహ వేడుక

Share Icons:
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నితిన్ పెళ్లి తేదీ ఎట్టకేలకు ఖరారు అయ్యింది. ఈనెలలోనే నితిన్ తానే ప్రేమించిన అమ్మాయి షాలినితో మూడు మూళ్ల బంధంతో ఒక్కటవుతున్నారు. వీరిద్దరూ గత నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసింది. నిశ్చితార్థం పూర్తి చేసుకున్నా కరోనా కారణంగా పెళ్లి తేదీని వాయిదా వేస్తూ వచ్చారు. ఈ సంగతి అందరికీ తెలిసిందే. ముందుగా పెళ్లిని ఘనంగా చేసుకోవాలని నితిన్ భావించాడు. దుబాయ్‌ లో ఏప్రిల్ 16న డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకోవాలని అనుకున్నాడు. అయితే కరోనా కారణంగా అలా వేసుకున్న ప్లాన్ ముందుకుసాగలేదు.

దీంతో హైదరాబాద్‌లోనే అతి తక్కుమంది సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేయాలని అనుకున్నారు ఇరు కుటుంబాల పెద్దలు. అయితే పెళ్లి తేదీ మాత్రం వాయిదా వేస్తు వస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం నితిన్ తన పెళ్ళిని ఈ నెల 26న చేసుకోనున్నాడని సమాచారం. అంతేకాదు ఈ వివాహం హైదరాబాద్‌ లో వధువు ఇంటి వద్దే జరుగునుందట. ముందుగా శివారుల్లో ఫామ్ హౌస్‌లో నిర్వహించాలని భావించారు. కానీ చివరకి వధువు షాలిని ఇంటి దగ్గరే పెళ్లి చేయాలని ఇరు కుటుంబాల పెద్దలు నిశ్చయించినట్లు సమాచారంజ

నితిన్ నటించిన భీష్మ సినిమాలో ఇటీవలే విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దేలో నితిన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కీర్తి సురేష్‌తో నితిన్ జతకడుతున్నాడు. ఈ సినిమాతో పాటు నితిన్ చంద్రశేఖర్ యేలేటీ దర్శకత్వంలో మరో సినిమాను కూడా చేస్తున్నాడు. హిందీలో సూపర్ హిట్టైనా అంధాధున్‌ తెలుగు రీమేక్‌లో కూడా నితిన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. అంధాధున్ హిందీలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించారు.