నిఖిల్ 20: పెళ్లి తర్వాత బిజీ అవుతున్న నిఖిల్! మరో సినిమా ఫిక్స్

Share Icons:
ఇటీవలే తన ఇష్ట సఖి పల్లవిని పెళ్ళాడి ఓ ఇంటివాడైన టాలీవుడ్‌ యంగ్ హీరో సినిమాల పరంగా వేగం పెంచేశాడు. ఈ మ‌ధ్యే ‘అర్జున్ సుర‌వ‌రం’ సినిమాతో హిట్ అందుకొని హుషారుగా ఉన్న ఆయన తన 20వ సినిమా ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు నిఖిల్. ఎల్ఎల్‌పీ (ఏషియ‌న్ గ్రూప్ యూనిట్‌) బ్యాన‌ర్‌పై నారాయణ్‌దాస్ కె. నారంగ్‌, పుస్కూర్ రామ్మోహ‌న్‌రావు సంయుక్త నిర్మాణంలో ఈ మూవీ రూపొందనుంది.

Also Read:
సోనాలీ నారంగ్ సమర్పణలో తెరకెక్కనున్న ఈ మూవీ డైరెక్టర్, ఇతర నటీనటుల వివరాలు అతి త్వరలో ప్రకటించనున్నారు. ప్రొడ‌క్ష‌న్ వ్య‌వ‌హారాల‌ను రెయిన్‌బో రీల్స్ చూసుకోనుంది. భారీ బ‌డ్జెట్‌ కేటాయించి ఈ సినిమా నిర్మించనున్నారట. అయితే ఈ మూవీకి సైన్ చేయడం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేసిన నిఖిల్.. ఈ బ్యానర్‌లో బిగ్ హిట్స్ సాధిస్తామనే నమ్మకముందని తెలిపారు.

కాగా ఇప్పటికే చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో ‘కార్తికేయ 2’, ప‌ల్నాటి సూర్య‌ప్ర‌తాప్ డైరెక్ష‌న్‌లో ’18 పేజెస్’ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పెళ్లి తర్వాత ఒకేసారి మూడు సినిమాలతో నిఖిల్ ప్రేక్షకుల ముందుకు రానుండటం ఆసక్తికరంగా మారింది. ‌