నా మనసుకు నచ్చిందే చేస్తా.. పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన హీరో సూర్య

Share Icons:
సినిమాల్లో తామేంటో నిరూపించుకున్న చాలామంది హీరోలు రాజకీయాల్లోనూ తమ భవిష్యత్‌ను పరీక్షించుకుంటారు. ఇందులో కొందరు ఏకంగా ముఖ్యమంత్రులై హీరోలుగా నిలిస్తే.. మరికొందరేమో జీరోలుగా మిగిలిపోతారు. తమిళంలో ఎంజీఆర్, తెలుగులో ఎన్టీఆర్ లాంటి వారు వెండితెరపైనా.. రాజకీయాల్లోనే హీరోలుగా నిలిచారు. ప్రస్తుతం తెలుగులో అగ్రహీరోగా ఉన్న పవన్ కళ్యాణ్‌ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన రెండు పడవలపై ప్రయాణం చేస్తున్న సంగతి తెలిసిందే.

Also Read:

కోలీవుడ్‌లో టాప్‌ హీరోగా కొనసాగుతున్న విజయ్ పొలిటికల్ ఎంట్రీపై ఎప్పటినుంచో చర్చ నడుస్తూనే ఉంది. ఇటీవల ఆయన తండ్రి చంద్రశేఖర్ విజయ్ పేరిటి పొలిటికల్ పార్టీ రిజిస్టర్ చేయించడం హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ఆ పార్టీకి, తనకు ఎలాంటి సంబంధం లేదని విజయ్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే రాజకీయ రంగ ప్రవేశంపైనా చర్చ జరుగుతోంది.

ఈ నేపథ్యంలో తన రాజకీయ ప్రవేశంపై సూర్య ఓ క్లారిటీ ఇచ్చేశారు. తనకు రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేదని స్పష్టం చేశారు. తన మనసుకు నచ్చిందే చేస్తానని, సేవా దృక్పథంతోనే సామాజిక కార్యక్రమాలు చేస్తున్నానని తెలిపారు. తన సేవా కార్యక్రమాల వెనుక రాజకీయ ఉద్దేశం లేదని సూర్య స్పష్టం చేశారు.