నాపై రేప్ జరిగింది: షాకింగ్ విషయాలు బయటపెట్టిన కమెడియన్ రాహుల్ రామకృష్ణ

Share Icons:
రాహుల్ రామకృష్ణ.. ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ హ్యాపెనింగ్ కమెడియన్. 2014లో ‘సైన్మా’ అనే షార్ట్ ఫిలింతో బాగా ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత 2016లో వచ్చిన ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సినిమాతో నటుడిగా, డైలాగ్ రైటర్‌గా మారారు. కానీ ఆయనకు బ్రేక్ ఇచ్చింది మాత్రం ‘అర్జున్ రెడ్డి’ సినిమానే. ఇందులో రాహుల్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అతని యాసకు, కామెడీ టైమింగ్‌కి నూటికి నూరు మార్కులు వేశారు. ఆ తర్వాత రాహుల్‌కు వరుసగా అవకాశాలు వచ్చిపడ్డాయి. సినిమాల సంగతి పక్కన బెడితే రాహుల్ తన వ్యక్తిగత విషయాలను బయటపెట్టారు. తనపై చిన్నప్పుడే రేప్ జరిగిందని తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు.

READ ALSO:

‘‘నన్ను చిన్నప్పుడు రేప్ చేశారు. నా బాధను ఎవరితో ఎక్కడ పంచుకోవాలో తెలీలేదు. అందుకే ట్విటర్‌లో పోస్ట్ చేద్దామని అనుకున్నాను. ఇలా ఇతరులతో పంచుకోవడం ద్వారానే నేనేంటో తెలుసుకోగలుగుతున్నాను. అన్నీ బాధగానే ఉంటాయి’ అని పేర్కొన్నారు. ఈ విషయం తెలిసి చాలా మంది ఫ్యా్న్స్ షాక్‌కు గురయ్యారు. రాహుల్‌కి ధైర్యం చెప్తూ ట్వీ్ట్స్ పెడుతున్నారు. ఎప్పుడూ చిరునవ్వుతో ఇతరులకు నవ్వులు పంచే వ్యక్తి వెనుక ఇంతటి చేదు అనుభవం ఉండడం నిజంగా బాధాకరమనే చెప్పాలి.