నాకున్న చెత్త అలవాటు అది.. తెలియకుండానే జరిగిపోతుంది: సీక్రెట్స్ చెప్పేసిన అనసూయ

Share Icons:
తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న స్టార్ యాంకర్లలో భరద్వాజ్ ఒకరు. బుల్లితెరపై యాంకర్‌గా, వెండితెరపై నటిగా ఆమె అద్భుతంగా రాణిస్తున్నారు. తన యాంకరింగ్, నటనతో ప్రేక్షకులను మెప్పిస్తోన్న, వినోదాన్ని పంచుతోన్న అనసూయ.. సోషల్ మీడియా ద్వారా కూడా ఎప్పటికప్పుడు తన అభిమానులకు, ఫాలోవర్లకు టచ్‌లో ఉంటున్నారు. వీటితో పాటు తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా కూడా ప్రేక్షకులకు చేరువవుతున్నారు. ఈ ఛానెల్ ద్వారా వంటలు, బ్యూటీ టిప్స్, ఆరోగ్య సూత్రాలను వెల్లడిస్తున్నారు.

అనసూయ తాజాగా తన యూట్యూబ్ ఛానెల్‌లో ఒక వీడియోను అప్‌లోడ్ చేశారు. పార్టీలకు ఆమె ఎలా సిద్ధమవుతారో ఈ వీడియో ద్వారా అనసూయ చూపించారు. తన స్నేహితురాలి పుట్టినరోజు ఉందని, ఆ చిన్న పార్టీకి తాను సిద్ధమవుతున్నానని ఈ వీడియోలో అనసూయ చెప్పారు. ప్రస్తుత కరోనా సమయంలో గుంపులుగా ఉండటం సరికాదని చెప్పిన అనసూయ.. తాము చాలా జాగ్రత్తలు తీసుకుంటూ పార్టీలో పాల్గొనబోతున్నామని వెల్లడించారు.

కంఫర్ట్ చాలా ఇంపార్టెంట్..
అనసూయ ఒక పార్టీకి వెళ్లడానికి సిద్ధమైనప్పుడు కంఫర్ట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారట. ఆమెకు డ్రెస్‌లో కంఫర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. కంఫర్ట్, ఎక్స్‌పెరిమెంట్.. డ్రెస్‌లో ఈ రెండింటిని అనసూయ ప్రధానంగా తీసుకుంటారట. పార్టీ అంటే టైట్ డ్రెస్ వేసుకుని, పొట్ట లోపలికి పెట్టుకుని, హై హీల్స్ వేసుకుని రెడీ అవ్వడానికి తాను చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తానని అనసూయ చెప్పారు. సింపుల్‌గా, వెరైటీగా ఉండే బట్టలు వేసుకుంటానని వెల్లడించారు.

నాకున్న బ్యాడ్ హ్యాబిట్ అదే..
ఓ వైపు మేకప్ ఎలా వేసుకోవాలో చూపిస్తూ సరదాగా కొన్ని విషయాలు మాట్లాడారు అనసూయ. తన ముఖంపై చాలా మచ్చలు ఉంటాయని, దగ్గరగా వచ్చి చూస్తే కనిపిస్తాయని అనసూయ అన్నారు. తన మేనత్తలకు, నానమ్మకు ఇలానే ఉండేవని చెప్పారు. తన చిన్న చెల్లికి అయితే మరీ భయంకరంగా ఉంటాయని అన్నారు.

దీనికి తోడు తన ముఖంపై ఎప్పుడైనా మొటిమ వస్తే గిచ్చేసుకుంటానని తెలిపారు. ముఖంపై ఉన్న మచ్చలన్నీ అవేనని అన్నారు. ఇది తనకున్న చెత్త అలవాటని అనసూయ వెల్లడించారు. కాకపోతే, తాను బీభత్సంగా ఆలోచిస్తూ గిచ్చేసుకుంటూ ఉంటానని.. తనకు తెలియకుండానే జరిగిపోతుందని అన్నారు. ఇంట్లో రెడీ అయ్యేటప్పుడు తాను అస్సలు దువ్వెన వాడనని అనసూయ చెప్పారు. ‘నా సీక్రెట్స్ అన్నీ చెప్పేస్తున్నా’ అంటూ ఒక్కో విషయాన్ని చెప్పుకొచ్చారామె.