నాంది టీజర్: నగ్నంగా నరేష్.. అబ్బో! మనోడు మామూలు డైలాగ్ చెప్పలేదండీ బాబూ

Share Icons:
ఇన్నాళ్లు కామెడీ సినిమాలతో కడుపుబ్బా నవ్వించిన .. ఈ సారి ట్రాక్ ఛేంజ్ చేశారు. కామెడీలోనే ఎమోషన్ పండిస్తూ ఆకట్టుకున్న ఆయన ఇప్పుడు మాత్రం పూర్తిస్థాయి ఎమోషనల్ కాన్సెప్ట్‌తో ” రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథకు ఎమోషనల్ అంశాలు కలిపి రెడీ చేసిన ఈ కథను డైరెక్టర్ విజయ్ కనకమేడల తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి.

కాగా ఈ రోజు (జూన్ 30) అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బర్త్ డే విషెస్ తెలుపుతూ ‘నాంది’ టీజర్ రిలీజ్ చేసి మరింత అట్రాక్ట్ చేశారు మేకర్స్. ఒక నిమిషం 28 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ టీజర్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా ఉంది. టీజర్‌లో చూపించిన సన్నివేశాలు సినిమాపై ఆతృతను పెంచేశాయి. ఇక ఇందులో నరేష్ చెప్పిన డైలాగ్ అందరినీ ఆలోచింపజేయడమే గాక మూవీపై అంచనాలు పెంచేసింది.

Also Read:
”ఒక మనిషి పుట్టడానికి కూడా తొమ్మిది నెలలే టైమ్‌ పడుతుంది. మరి నాకు న్యాయం చెప్పడానికేంటి సర్‌.. ఇన్ని సంవత్సరాలు పడుతోంది” అంటూ తీవ్ర ఆవేదన చెందుతూ నరేష్ ఈ డైలాగ్ చెప్పారు. ఈ టీజర్ చూస్తుంటే అల్లరి నరేష్.. సినిమా కోసం తన శక్తిని మొత్తం ఉపయోగించడని స్పష్టంగా తెలుస్తోంది. చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, ప్రియదర్శి, హరిశ్‌ ఉత్తమన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మరోవైపు ఈ ఆసక్తికర టీజర్‌ని ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. ”ఈ ప్రపంచంతో ‘నాంది’ టీజర్‌ పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. చిత్ర బృందానికి నా తరఫున హృదయపూర్వక అభినందనలు. నరేష్‌ అన్న అద్భుతంగా నటించారని స్పష్టమవుతోంది” అని విజయ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.